Share News

GRT Jewellers Diwali Offers: జీఆర్‌టీ జువెలర్స్‌ దీపావళి ఆఫర్లు

ABN , Publish Date - Oct 08 , 2025 | 06:29 AM

జీఆర్‌టీ జువెలర్స్‌.. దీపావళి పండగను పురస్కరించుకుని ‘సిల్వర్‌ ఫర్‌ గోల్డ్‌’ పేరుతో ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఆఫర్‌లో భాగంగా వినియోగదారులకు బంగారు ఆభరణాల...

GRT Jewellers Diwali Offers: జీఆర్‌టీ జువెలర్స్‌ దీపావళి ఆఫర్లు

చెన్నై (ఆంధ్రజ్యోతి): జీఆర్‌టీ జువెలర్స్‌.. దీపావళి పండగను పురస్కరించుకుని ‘సిల్వర్‌ ఫర్‌ గోల్డ్‌’ పేరుతో ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ ఆఫర్‌లో భాగంగా వినియోగదారులకు బంగారు ఆభరణాల కొనుగోలుపై అందుకు సమానమైన బరువుతో వెండిని పూర్తిగా ఉచితంగా అందించనుంది. దీంతోపాటుగా బంగారు ఆభరణాలపై గ్రాముకు రూ.100 తగ్గింపును జీఆర్‌టీ అందిస్తోంది. అలాగే వజ్రాభరణాల కొనుగోలుపై ప్రతి క్యారెట్‌కు 25 గ్రాముల వెండి, అన్‌కట్‌ డైమండ్స్‌పై ప్రతి క్యారెట్‌కు 2 గ్రాముల వెండిని ఉచితంగా అందించనుంది. ప్లాటినం ఆభరణాలపై ఆభరణం బరువుతో సమానంగా వెండి పూర్తిగా ఉచితంగా ఆఫర్‌ చేస్తోంది. మరోవైపు వినియోగదారులకు వెండి వస్తువుల మేకింగ్‌ చార్జీలపై 25 శాతం తగ్గింపు (ప్రత్యేక వస్తువులు మినహా), వెండి ఆభరణాలు, గిఫ్ట్‌ ఆర్టికల్స్‌ వస్తువుల ఎంఆర్‌పీపై 10 శాతం తగ్గింపును అందిస్తున్నట్లు జీఆర్‌టీ జువెలర్స్‌ ఎండీ జీఆర్‌ అనంత పద్మనాభన్‌ తెలిపారు.

ఇవీ చదవండి:

లాభాల నుంచి నష్టాల్లోకి.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..

ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

మరిన్ని బిజినెస్అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 08 , 2025 | 06:29 AM