జీఆర్‌టీ జ్యువెలర్స్ గోల్డ్ ఫర్ ఆల్ ఆఫర్
ABN , Publish Date - Jun 26 , 2025 | 05:38 AM
ఆభరణాల రిటైలింగ్ దిగ్గజం జీఆర్‌టీ జ్యువెల్లర్స్ తమ వినియోగదారుల కోసం మరో వినూత్న ఆఫర్‌ను ప్రకటించింది. అతి తక్కువ వేస్టేజ్ చార్జీల (వీఏ) ద్వారా,,,
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ఆభరణాల రిటైలింగ్ దిగ్గజం జీఆర్‌టీ జ్యువెల్లర్స్ తమ వినియోగదారుల కోసం మరో వినూత్న ఆఫర్‌ను ప్రకటించింది. అతి తక్కువ వేస్టేజ్ చార్జీల (వీఏ) ద్వారా వినియోగదారులు తాము నిర్దేశించుకున్న బడ్జెట్‌కు ఎక్కువ బంగా రం కొనుగోలు చేసేలా ‘‘గోల్డ్ ఫర్ ఆల్’’ పేరుతో ఈ ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఆఫర్‌లో వేస్టేజ్ చార్జీలు కేవలం 5 శాతం నుంచి ప్రారంభమవుతాయని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ జీఆర్ ఆనంద్ అనంత పద్మనాభన్ తెలిపారు. ఈ ఆఫర్ ద్వారా తక్కువ ఖర్చులో కస్టమర్లకు ఆకర్షణీయమైన డిజైన్లను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఒక్కోసారి వారు పొందే అదనపు బంగా రం ఒక గ్రాము వరకు కూడా ఉంటుందన్నారు. తమ చేతిలోకి అదనంగా ఏదైనా డబ్బు వచ్చినట్టయితే భారతీయులకు బంగారం కొనడం సాంప్రదాయికంగా వస్తున్న ఆచారమని, బంగారం ధరలు ఎప్పుడెలా ఉంటాయో ఊహించడం కష్టంగా ఉన్న సమయంలో ‘‘గోల్డ్ ఫర్ ఆల్’’ తమ కస్టమర్లకు విలువను జోడిస్తుందని చెప్పారు.
ఇవీ చదవండి:
1600 కోట్ల పాస్‌వర్డ్‌లు ఆన్‌లైన్‌లో లీక్.. హెచ్చరించిన గూగుల్
ఈ యాప్ 20 లక్షల పోయిన ఫోన్‌లను గుర్తించింది.. ఎలాగంటే..
మరిన్ని ఏపీ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి