Share News

LIC Stake Sale: ఎల్‌ఐసీలో 3 శాతం వాటా విక్రయం

ABN , Publish Date - Aug 14 , 2025 | 02:25 AM

ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌లో కేంద్రం 2.5-3 శాతం వాటా విక్రయించాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా...

LIC Stake Sale: ఎల్‌ఐసీలో 3 శాతం వాటా విక్రయం

రూ.17,000 కోట్ల వరకు సమీకరణ!!

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌లో కేంద్రం 2.5-3 శాతం వాటా విక్రయించాలని భావిస్తున్నట్లు సమాచారం. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియలో భాగంగా ఎల్‌ఐసీలో తొలి విడతగా మోదీ సర్కారు ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎ్‌ఫఎస్‌) ద్వారా ఈ వాటాను విక్రయించాలనుకుంటోంది. ఇందుకు సంబంధించి వచ్చే రెండు వారాల్లోగా రోడ్‌షోలను ప్రారంభించనున్నట్లు తెలిసింది. మోతీలాల్‌ ఓస్వాల్‌, ఐడీబీఐ క్యాపిటల్‌ ఈ ప్రక్రియకు మర్చంట్‌ బ్యాంకర్లుగా వ్యవహరించే అవకాశం ఉంది. రోడ్‌షో అనంతరం విక్రయించనున్న వాటా, ధరలపై ప్రభుత్వం తుది నిర్ణయానికి రానుందని తెలిసింది. బుధవారం ఎల్‌ఐసీ షేరు 3.50ు తగ్గి రూ.884.30 వద్ద ముగిసింది. ఈ లెక్కన కంపెనీలో వాటా విక్రయం ద్వారా ప్రభుత్వం రూ.14,000-17,000 కోట్ల వరకు సమీకరించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఎల్‌ఐసీలో కేంద్ర ప్రభుత్వం 96.5ు వాటా కలిగి ఉంది. ఎల్‌ఐసీ తన పబ్లిక్‌ షేర్‌హోల్డింగ్‌ వాటాను ప్రస్తుతమున్న 3.5ు నుంచి 2027 మార్చి 16 నాటికి 10 శాతానికి పెంచుకోవాలని సెబీ ఆదేశించింది. ఈ నేపథ్యంలో కేంద్రం ఎల్‌ఐసీలో వాటాల ఉపసంహరణకు సిద్ధమయింది. ఈ ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.47,000 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోవాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో మూడో వంతు వరకు ఎల్‌ఐసీ వాటా ద్వారానే సమకూరే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి

ఈ తేదీకి ముందే ఐటీఆర్ దాఖలు చేయండి… ఆలస్య రుసుమును తప్పించుకోండి

రైల్వే టిక్కెట్లపై 20% తగ్గింపు ఆఫర్.. ఈ అవకాశాన్ని వినియోగించుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 14 , 2025 | 02:25 AM