Gold Rates: పసిడి కొత్త రికార్డు
ABN , Publish Date - Jan 30 , 2025 | 02:14 AM
దేశీయంగా బంగారం ధరలు సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయికి పెరిగాయి. ఢిల్లీ మార్కెట్లో 99.9 స్వచ్ఛత బంగారం ధర 10 గ్రాములపై రూ.910 పెరుగుదలతో...

రూ.83,750కి చేరిన తులం ధర
న్యూఢిల్లీ: దేశీయంగా బంగారం ధరలు సరికొత్త జీవనకాల గరిష్ఠ స్థాయికి పెరిగాయి. ఢిల్లీ మార్కెట్లో 99.9 స్వచ్ఛత బంగారం ధర 10 గ్రాములపై రూ.910 పెరుగుదలతో రూ.83,750కి చేరుకుంది. 99.5 స్వచ్ఛత లోహం సైతం అదే స్థాయిలో పెరిగి రూ.83,350 స్థాయికి ఎగబాకింది. అంతర్జాతీయంగా బంగారం రేటు పెరగడంతో పాటు దేశీయంగా ఆభరణాల తయారీదారులు, రిటైలర్లు కొనుగోళ్లు పెంచడం ఇందుకు కారణమని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ పేర్కొంది. కాగా, కిలో వెండి రూ.1,000 పెరుగుదలతో రూ.93,000 ధర పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ (31.10 గ్రాములు) గోల్డ్ ఒకదశలో 2,794.70 డాలర్ల స్థాయికి ఎగబాకగా.. వెండి 30.99 డాలర్ల వద్ద ట్రేడైంది.
ఇవి కూడా చదవండి:
IRCTC: తక్కువ ధరలకే కుంభమేళా టూర్ ప్యాకేజీ.. ఇలా బుక్ చేసుకోండి మరి..
Budget 2025: వచ్చే బడ్జెట్‌లో కొత్త ఆదాయపు పన్ను బిల్లు.. 60 శాతం తగ్గింపు..
Investment Plan: మీ పదవీ విరమణకు ఇలా ప్లాన్ చేయండి.. రూ. 2 కోట్లు పొందండి..
Read More Business News and Latest Telugu News