Share News

Gold, Silver Prices on Nov 23: పెళ్లిళ్ల సీజన్‌.. పసిడి ధరల్లో పెరుగుదల.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..

ABN , Publish Date - Nov 23 , 2025 | 06:26 AM

దేశంలో పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి. అయితే, ఇన్వెస్టర్లు మాత్రం ఆచితూచి వ్యవహరిస్తున్నారని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో దేశంలో వివిధ నగరాల్లో బంగారం, వెండి రేట్స్ ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.

Gold, Silver Prices on Nov 23: పెళ్లిళ్ల సీజన్‌.. పసిడి ధరల్లో పెరుగుదల.. నేటి రేట్స్ ఎలా ఉన్నాయంటే..
Gold, Silver Rates in India On Nov 23

ఇంటర్నెట్ డెస్క్: ఇది పెళ్లిళ్ల సీజన్ కావడంతో దేశంలో బంగారం ధరల పెరుగుతున్నాయి. అయితే, అమెరికా ఆర్థిక వ్యవస్థలో వృద్ధి కారణంగా ఫెడ్ రేట్‌లలో కోత ఉండదన్న అంచనాల ఉన్నాయి. దీంతో, ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేటి ఉదయం 6.00 గంటలకు దేశంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,840గా ఉంది. 22 క్యారెట్ గోల్డ్ రేట్ రూ.1,15,350కు చేరుకుంది. ఇక కిలో వెండి ధర 1,64,000 వద్ద కొనసాగుతోంది (Gold Rates on Nov 23).

అంతర్జాతీయ మార్కెట్‌లో 24 క్యారెట్ ఔన్స్ పసిడి ధర 4,065 డాలర్లుగా ఉంది. ఔన్స్ వెండి ధర 50 డాలర్ల వద్ద తచ్చాడుతోంది. ప్రస్తుతం ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తున్నారని మార్కెట్ పరిశీలకులు కామెంట్ చేస్తున్నారు. ఫలితంగా బంగారానికి డిమాండ్ ఓ మోస్తరు స్థాయిలో కొనసాగుతోందని చెబుతున్నారు. ఇటీవలి కాలంలో పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు ఇదే కారణమని అంటున్నారు.


దేశంలో ప్రధాన నగరాల్లో బంగారం (24కే, 22కే, 18కే) ధరలు ఇలా

  • చెన్నై: ₹1,26,880; ₹1,16,300; ₹97,000

  • ముంబై: ₹1,25,840; ₹1,15,350; ₹94,380

  • న్యూ ఢిల్లీ: ₹1,25,990; ₹1,15,500; ₹94,530

  • కోల్‌కతా: ₹1,25,840; ₹1,15,350; ₹94,380

  • బెంగళూరు: ₹1,25,800; ₹1,15,320; ₹94,380

  • హైదరాబాద్: ₹1,25,840; ₹1,15,350; ₹94,380

  • విజయవాడ: ₹1,25,840; ₹1,15,350; ₹94,380

  • కేరళ: ₹1,25,800; ₹1,15,300; ₹94,380

  • పూణె: ₹1,25,850; ₹1,15,280; ₹94,380

  • వడోదరా: ₹1,25,890; ₹1,15,400; ₹94,430

  • అహ్మదాబాద్: ₹1,25,890; ₹1,15,400; ₹94,430

వెండి రేట్స్ ఇవీ

  • చెన్నై: ₹1,72,000

  • ముంబై: ₹1,64,000

  • న్యూ ఢిల్లీ: ₹1,64,000

  • కోల్‌కతా: ₹1,64,000

  • బెంగళూరు: ₹1,64,000

  • హైదరాబాద్: ₹1,72,000

  • విజయవాడ: ₹1,72,000

  • కేరళ: ₹1,72,000

  • పూణే: ₹1,64,000

  • వడోదరా: ₹1,64,000

  • అహ్మదాబాద్: ₹1,64,000


గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. వార్త రాస్తున్న సమయానికి ధరల వివరాలు పైన తెలిపిన విధంగా ఉన్నాయి. కాబట్టి బంగారం కొనుగోలు చేసే ముందు.. ధరలు మళ్లీ ఒకసారి పరిశీలించుకోగలరు.

ఇవీ చదవండి:

అన్‌క్లెయిమ్డ్‌ బీమా మొత్తాలు క్లెయిమ్‌ చేసుకోవడం ఎలా

అమెజాన్‌లో భారీ లే ఆఫ్స్.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల పైనే ఎక్కువ ఎఫెక్ట్..

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 23 , 2025 | 06:54 AM