Gold Rates on Dec 22: వినియోగదారులకు అలర్ట్.. నేటి బంగారం, వెండి ధరలు ఇవీ..
ABN , Publish Date - Dec 22 , 2025 | 06:33 AM
ఈ వారం బంగారం, వెండి ధరలు కాస్త దిద్దుబాటుకు గురయ్యే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. హాలిడే సీజన్ మొదలు కానుండటమే ఇందుకు కారణం. మరి ఈ నేపథ్యంలో దేశంలో ప్రస్తుతం బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: ఈ ఏడాది బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరిగాయి. వచ్చే ఏడాది కూడా ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే, ఈ వారం మాత్రం బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గే అవకాశం ఉందనేది పరిశీలకుల అంచనా. హాలిడే సీజన్ మొదలు కావడంతో ట్రేడింగ్ నెమ్మదించి ధరలు దిద్దుబాటుకు గురయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక భారత్‌లో ఇప్పటికే బంగారం, వెండి ధరలు సరికొత్త గరిష్ఠాలను నమోదు చేశాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేటి ఉదయం 6.30 గంటల సమయంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ. 1,34,170గా ఉంది. 22 క్యారెట్ ఆర్నమెంటల్ పసిడి ధర రూ.1,22,990. ఇక కిలో వెండి ధర రూ.2,13,900 వద్ద కొనసాగుతోంది (Gold, Silver Rates on Dec 22).
పరిశీలకులు చెప్పే దాని ప్రకారం, క్రిస్మస్, నూతన సంవత్సరం సెలవుల నేపథ్యంలో బుధవారం నుంచే ట్రేడింగ్ నెమ్మదించే అవకాశం ఉంది. ఇక గత ఎమ్‌సీఎక్స్ గోల్డ్ ఫ్యూచర్స్ ధరలు 0.43 శాతం మేర పెరిగి రూ.1,35,530 ఆల్ టైమ్ గరిష్ఠాన్ని తాకాయి. డాలర్ బలహీనపడటం, ఫెడ్ రేటులో కోతకు పెరుగుతున్న అవకాశాలు వెరసి గోల్డ్‌కు డిమాండ్ పెంచాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, గత వారం పసిడి కంటే వెండి మదుపర్లుకు భారీ లాభాలను తెచ్చి పెట్టింది. వారం వ్యవధిలో ఏకంగా 8.08 శాతం పెరగడంతో జనాలు మంచి లాభాలను కళ్లచూశారు. భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, సరఫరాలో కొరత వంటివి వెండి ధరలను పైకి ఎగదోస్తున్నాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ వెండి రికార్డు స్థాయిలో 67.55 డాలర్ల వద్ద కొనసాగుతోంది. 24 క్యారెట్ ఔన్స్ పసిడి 4,365 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
వివిధ నగరాల్లో బంగారం రేట్స్ (24కే, 22కే, 18కే) ఇవీ
చెన్నై: ₹1,35,270; ₹1,23,990; ₹1,03,440
ముంబై: ₹1,34,170; ₹1,22,990; ₹1,00,630
న్యూఢిల్లీ: ₹1,34,320; ₹1,23,140; ₹1,00,780
కోల్‌కతా: ₹1,34,170; ₹1,22,990; ₹1,00,630
బెంగళూరు: ₹1,34,170; ₹1,22,990; ₹1,00,630
హైదరాబాద్: ₹1,34,170; ₹1,22,990; ₹1,00,630
విజయవాడ: ₹1,34,170; ₹1,22,990; ₹1,00,630
కేరళ: ₹1,34,170; ₹1,22,990; ₹1,00,630
పుణె: ₹1,34,170; ₹1,22,990; ₹1,00,630
వడోదరా: ₹1,34,220; ₹1,23,040; ₹1,00,680
అహ్మదాబాద్: ₹1,34,220; ₹1,23,040; ₹1,00,680
వెండి ధరలు ఇవీ
చెన్నై: ₹2,25,900
ముంబై: ₹2,13,900
న్యూఢిల్లీ: ₹2,13,900
కోల్‌కతా: ₹2,13,900
బెంగళూరు: ₹2,13,900
హైదరాబాద్: ₹2,25,900
విజయవాడ: ₹2,25,900
కేరళ: ₹2,25,900
పుణె: ₹2,13,900
వడోదరా: ₹2,13,900
అహ్మదాబాద్: ₹2,13,900
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు మార్కెట్లలో ఎప్పటికప్పుడు మారుతుంటాయి. కాబట్టి కొనుగోలుదార్లు ఆ సమయంలో మరోసారి ధరలను పరిశీలించగలరు.
ఇవీ చదవండి:
700 బిలియన్ డాలర్ల పైచిలుకు సంపద.. ఎలాన్ మస్క్ మరో రికార్డు
స్టాక్ మార్కెట్.. ఈ వారం కూడా ఆటుపోట్లలోనే!
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి