Gold and Silver: మరోసారి పెరిగిన బంగారం, వెండి ధరలు
ABN , Publish Date - Oct 08 , 2025 | 12:38 PM
బంగారం, వెండి ధరలు ఇవాళ మరోసారి పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఇవాళ రూ.1,26,070గా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,16,750 గా కొనసాగుతోంది. ఇక, వెండి కూడా ఏకబిగిన పెరుగుతూ తన హవా..
ఇంటర్నెట్ డెస్క్: ఇటీవలి కాలంలో చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు ఇవాళ మరోసారి పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ఇవాళ రూ.1,26,070గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,16,750 గా కొనసాగుతోంది. ఇక, వెండి కూడా ఏకబిగిన పెరుగుతూనే తన హవా కొనసాగిస్తోంది. ఇవాళ్టి మార్కెట్లో కిలో వెండి ధర రూ.1,58,400 వద్ద కొనసాగుతోంది.
పెరుగుతున్న అంతర్జాతీయ మార్కెట్ రేట్లు, రూపాయి విలువలో తేడాలు దేశీయ బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. బంగారం – వెండి ధరలు పెరగడంతో జ్యువెలరీ కొనుగోళ్లపై వినియోగదారులు కొంత వెనుకంజ వేస్తున్నా, దీపావళి పండుగ సీజన్ దృష్ట్యా మార్కెట్‌లో రద్దీ పెరగవచ్చని, తద్వారా ధరలు కూడా పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు.
ఇవీ చదవండి:
లాభాల నుంచి నష్టాల్లోకి.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి