Share News

మళ్లీ పెరిగిన పసిడి ధరలు.. వినియోగదారులకు షాక్

ABN , Publish Date - Mar 07 , 2025 | 07:21 AM

పసిడి ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. నేడు మరోసారి బంగారం ధరలు పెరిగాయి. మరి వివిధ నగరాల్లో ప్రస్తుత రేట్లు ఎలా ఉన్నాయ ఈ కథనంలో తెలుసుకుందాం.

మళ్లీ పెరిగిన పసిడి ధరలు.. వినియోగదారులకు షాక్

ఇంటర్నెట్ డెస్క్: పసిడి ప్రియులకు షాక్. బంగారం ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర నిన్నటితో పోలిస్తే స్వల్పంగా పెరిగి రూ.86,380కి చేరుకుంది. కిలో వెండి ధర కూడా పెరిగి రూ.98,340కు చేరుకుంది. ఈ పరిస్థితి పసిడిపై పెట్టుబడి పెట్టాలనుకుంటున్న వారు, శుభకార్యాలకు బంగారం కొనాలనుకుంటున్న వారికి ఇబ్బంది కరంగా మారింది. అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితుల కారణంగా బంగారానికి డిమాండ్ పెరుగుతోందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.


దేశంలోని ప్రధాన నగరాల్లో పసిడి ధరలు (24కే, 22కే)

న్యూఢిల్లీ: రూ.86,080; రూ.78,907

ముంబై: రూ.86,230; రూ.79,044

కోల్‌కతా: రూ.86,110; రూ.78,934

చెన్నై: రూ.86,480; రూ.79,273

బెంగళూరు: రూ.86,300; రూ.79,108

హైదరాబాద్: రూ.86,360; రూ.79,163

అహ్మదాబాద్: రూ.86,340; రూ.79,145

పూణె: రూ.86,230; రూ.79,044


మరో వైపు, బంగారంపై లోన్లలో అవకతవకలను కట్టడి చేసేందుకు ఆర్బీఐ తాజా నిబంధనలను కఠినతరం చేసింది. బంగారం తనఖా పెట్టుకుని బ్యాంకులు లోన్లు జారీ చేసే సమయంలో నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. లోన్ కోసం వచ్చే వారి బ్యాక్ గ్రౌండ్ చెక్ చేయాలని, లోన్ నిధులు ఎందుకు వినియోగిస్తున్నారో కూడా తనఖీ చేయాలని పేర్కొంది. బ్యాంకుల్లో పసిడిపై రుణాలు పెరుగుతుండంతో పాటు అవకతవకలు జరుగుతున్నట్టు ఆర్బీఐ దృష్టికి రావడంతో ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.

Read Latest and Business News

Updated Date - Mar 07 , 2025 | 08:29 AM