Gold Rates in India Today: రూ.90 వేలు మార్కు తాకిన పుత్తడి ధర.. రూ.లక్ష దాటిన వెండి
ABN , Publish Date - Mar 14 , 2025 | 07:36 AM
అమెరికా అధ్యక్షుడు సుంకాల పెంపు, వాణిజ్యు యుద్ధ భయాల నడుమ బంగారం ధరలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. వెండి ధర కూడా భారీగా పెరిగింది. నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే..

ఇంటర్నెట్ డెస్క్: మార్కెట్ అంచనాలకు దగ్గట్టుగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాల విధింపుతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. కొద్ది రోజులుగా నెమ్మదించిన పసిడి ధరలు ఒక్కసారిగా పెరిగాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ బంగారం ధర తొలిసారిగా రూ.90 వేల మార్కును తాకాయి. కిలో వెండి ధర కూడా. రూ. లక్ష మార్కును చేరుకుంది. దీంతో, బంగారం ఈమారు లక్ష దాటుతుందా అన్న అంచనాలు ఊపందుకున్నాయి.
ట్రంప్ మొదలెట్టిన వాణిజ్య యుద్ధంపై మార్కెట్ వర్గాల్లో ఆందోళన నెలకొంది. ఈ సారి అమెరికాలో మాంద్యం తప్పదన్న అంచనా జనాలను సురక్షిత పెట్టుబడి సాధనమైన బంగారం వైపు మళ్లేలా చేస్తోంది. దీంతో, పుత్తడి ధరలకు రెక్కలొచ్చాయి. అంతర్జాతీయంగా కూడా బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి.
దేశంలో వివిధ నగరాల్లో బంగారం ధలు ఎలా ఉన్నాయంటే..
న్యూఢిల్లీ: రూ.89,255
ముంబై: రూ.89,105
కోల్‌కతా: రూ89,350
చెన్నై: రూ.89,480
బెంగళూరు: రూ.89,490
అహ్మదాబాద్: రూ.89,465
విశాఖపట్నం: రూ.89,490