Share News

Gold Crosses Rs.1.28 lakh: భారీగా పెరిగిన బంగారం ధరలు! రూ.1.28 లక్షల మార్కు దాటిన వైనం

ABN , Publish Date - Oct 14 , 2025 | 11:51 AM

మంగళవారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. రూ.1.28 లక్షల మార్కును టచ్ చేశాయి. ఫెడ్ వడ్డీ రేట్లలో కోత తప్పదన్న అంచనాలు, వ్యవస్థాగత మదుపర్ల బంగారం కొనుగోళ్లు వెరసి బంగారం ధరలను చుక్కలనంటేలా చేస్తున్నాయి.

Gold Crosses Rs.1.28 lakh: భారీగా పెరిగిన బంగారం ధరలు! రూ.1.28 లక్షల మార్కు దాటిన వైనం
Gold Price Touch Rs.1.28 Lakh Mark

ఇంటర్నెట్ డెస్క్: అంతా ఊహించినట్టుగానే మంగళవారం దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రికార్డు స్థాయిలో రూ.1.28 లక్షలకు చేరుకుంది. 22 క్యారెట్‌ 10 గ్రాముల బంగారం ధర కూడా దాదాపు 3 వేల మేర పెరిగి రూ. 1,17,950కు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లల్లో కూడా బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. ఔన్స్ పసిడి ధర రికార్డు స్థాయిలో 4,162 డాలర్లకు చేరుకుంది. వడ్డీ రేట్లలో అమెరికా ఫెడ్ రిజర్వ్ కోత పెడుతుందన్న అంచనాలు, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, పసిడికి డిమాండ్‌ను పెంచాయి. గోల్డ్ ఆధారిత ఈటీఎఫ్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెరగడం కూడా ఓ కారణమని విశ్లేషకులు చెబుతున్నారు (Gold Croses Rs.1.28 Lakh Mark.

బంగారం ధరల పెరుగుదలకు అమెరికా, చైనా వాణిజ్య ప్రతిష్టంభన కొంత కారణమైనప్పటికీ ఫెడ్ వడ్డీ రోట్లలో కోత తప్పదన్న అంచనాల బంగారాన్ని మదుపర్లకు మరింత ఆకర్షణీయంగా మార్చాయి. లేబర్ మార్కెట్‌లో సమస్యల కారణంగా వడ్డీ రేటులో ఫెడరల్ రిజర్వ్ కోత పెడుతుందన్న అంచనాలు బలంగా ఉన్నాయి. ఇక భారత్‌లో పండుగ సీజన్, రూపాయి విలువలో హెచ్చుతగ్గులు వంటివన్నీ బంగారానికి డిమాండ్‌ను అంతకంతకూ పెంచుతున్నాయి. ఇటు రిటైల్ ఇన్వెస్టర్లు, అటు వ్యవస్థాగత మదుపర్ల నుంచి కూడా డిమాండ్ ఎక్కువ కావడం ర్యాలీకి కారణమని నిపుణులు చెబుతున్నారు (Gold Prices touches Record High).


మరికొన్ని రోజుల పాటు ధరల పెరుగుదల కొనసాగే అవకాశం ఉందనేది నిపుణుల అంచనా. ఈటీఎఫ్‌లల్లోకి పెట్టుబుడులు, కేంద్ర బ్యాంకుల బంగారం కొనుగోళ్లు కొనసాగుతున్నంత కాలం బంగారం ధరల మరింత పెరిగే ఛాన్స్ ఉంది. పశ్చిమాసియాలో ఉద్రికత్తలు సద్దుమణిగినా ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తూ బంగారం వైపే మొగ్గు చూపుతున్నారు. బ్యాంక్ ఆఫ్ అమెరికా అంచనా ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్ బంగారం ధర 2026 నాటికి 5 వేల డాలర్ల మార్కు దాటే అవకాశం ఉంది. వచ్చే ఏడాది నాటికి ఔన్స్ బంగారం ధర 4,488 డాలర్లకు చేరొచ్చని స్టాండర్డ్ ఛార్టర్డ్ బ్యాంకు అంచనా వేసింది.

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన.


ఇవీ చదవండి:

U S Senate Approves Biosecurity Ac: భారత ఫార్మా సీడీఎంఓ కంపెనీలకు ఊతం

మార్కెట్‌కు ట్రంప్‌ సుంకాల పోటు

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 14 , 2025 | 01:12 PM