Share News

Gold Price Record: పసిడి ధర మరింత ముందుకే

ABN , Publish Date - Aug 11 , 2025 | 05:20 AM

పసిడి పరుగుకు ఈ వారంలో కూడా బ్రేక్‌ పడే సూచనలు కనిపించడం లేదు. గత వారం జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి ధర రికార్డు స్థాయికి చేరింది. ఈ వారం సైతం బులియన్‌ మార్కెట్‌లో ఈ ర్యాలీ కొనసాగుతుందని...

Gold Price Record: పసిడి ధర మరింత ముందుకే

న్యూఢిల్లీ: పసిడి పరుగుకు ఈ వారంలో కూడా బ్రేక్‌ పడే సూచనలు కనిపించడం లేదు. గత వారం జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో పసిడి ధర రికార్డు స్థాయికి చేరింది. ఈ వారం సైతం బులియన్‌ మార్కెట్‌లో ఈ ర్యాలీ కొనసాగుతుందని మార్కెట్‌ వర్గాల అంచనా. గత వారం దేశీయ మార్కెట్‌లో 10 గ్రాముల మేలిమి బంగారం ధర రికార్డు స్థాయిలో రూ.1.03 లక్షలను అధిగమించింది. అంతర్జాతీయ మార్కెట్‌లోనూ ఔన్స్‌ (31.10 గ్రాములు) ధర గత శుక్రవారం ఒక దశలో రికార్డు స్థాయిలో 3,534.10 డాలర్లకు చేరింది. ప్రస్తుతం కొద్దిగా దిద్దుబాటుకు లోనై 3,400 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఈ వారం ఇది మరింత ముందుకు పరుగులు పెట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు. ‘‘గత నెల 28న రూ.98,079 పలికిన 10 గ్రాముల మేలిమి బంగారం, గత వారం రూ.1.03 లక్షల స్థాయికి చేరింది. ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్‌లోనూ ఔన్స్‌ పసిడి ధర 3,268 డాలర్ల నుంచి రికార్డు స్థాయిలో 3,534.10 డాలర్లకు చేరింది. ఈ ర్యాలీ ఇప్పట్లో ఆగేలా లేదు’’ అని ఏంజెల్‌ వన్‌ బ్రోకరేజి సంస్థ డిప్యూటీ వైస్‌ ప్రెసిడెంట్‌ (రీసెర్చి) ప్రతమేశ్‌ మాల్యా తెలిపారు. పరిస్థితులు ఇలానే కొనసాగితే వచ్చే మూడు నెలల్లో అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్స్‌ పసిడి ధర 3,800 డాలర్లకు, దేశీయ మార్కెట్‌లో 10 గ్రాముల పసిడి ధర రూ.1.10 లక్షలకు చేరే అవకాశం ఉందని మార్కెట్‌ వర్గాల అంచనా.

ర్యాలీకి దోహదం చేస్తున్న అంశాలు.

  • కొనసాగుతున్న సుంకాల యుద్ధం.

  • అమెరికాలో వడ్డీ రేట్లు తగ్గుతాయనే వార్తలు.

  • కొనసాగుతున్న కేంద్ర బ్యాంకుల పసిడి కొనుగోళ్లు.

  • ఫారెక్స్‌, స్టాక్‌ మార్కెట్లలో కొనసాగుతున్న నష్టాలు.

  • తగ్గుతున్న అమెరికా జీడీపీ వృద్ధి రేటు.

ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిపై చర్యలకు రంగం సిద్ధం..!

ప్రాజెక్ట్‌లను నిర్వీర్యం చేసిన బీఆర్ఎస్

For More Telangana News And Telugu News

Updated Date - Aug 11 , 2025 | 05:20 AM