Share News

Gold Prices Hit Record High: బంగారం రూ.1.40 లక్షలు

ABN , Publish Date - Dec 24 , 2025 | 02:50 AM

దేశీయంగా బంగారం, వెండి ధరలు సరికొత్త జీవితకాల రికార్డు గరిష్ఠానికి ఎగబాకాయి. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (99.9 శాతం స్వచ్ఛత) బంగారం రేటు మంగళవారం...

Gold Prices Hit Record High: బంగారం రూ.1.40 లక్షలు

  • సరికొత్త రికార్డు స్థాయికి ధరలు

న్యూఢిల్లీ: దేశీయంగా బంగారం, వెండి ధరలు సరికొత్త జీవితకాల రికార్డు గరిష్ఠానికి ఎగబాకాయి. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (99.9 శాతం స్వచ్ఛత) బంగారం రేటు మంగళవారం మరో రూ.2,650 పెరిగి రూ.1,40,850 కి చేరింది. అంతర్జాతీయంగా వీటి ధరలు కొత్త ఆల్‌టైం రికార్డు స్థాయికి చేరడమే ఇందుకు కారణం. ఇంటర్నేషనల్‌ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు) గోల్డ్‌ తొలిసారిగా 4,500 డాలర్ల మైలురాయిని దాటింది. సిల్వర్‌ సైతం తొలిసారి 70 డాలర్ల మార్క్‌ను తాకింది. వచ్చే ఏడాది ఫెడ్‌ రేట్లు మరింత తగ్గవచ్చన్న అంచనాలతోపాటు అమెరికా-వెనిజులా ఉద్రిక్తతలు కూడా ఇందుకు కారణమయ్యాయి.

ఇవీ చదవండి:

జోస్‌ అలుక్కాస్‌ ప్రచారకర్తగా దుల్కర్‌ సల్మాన్‌

ఈ ఏడాది ఐటీ నియామకాల్లో 16 శాతం వృద్ధి

Updated Date - Dec 24 , 2025 | 02:50 AM