కాసులు కురిపించిన పసిడి
ABN , Publish Date - Feb 27 , 2025 | 04:57 AM
అంతర్జాతీయ విపణిలో పసిడి ధర చుక్కలంటుతోంది. ఈ నెల ఒక దశలో ఔన్స్ (31.10 గ్రాములు) మేలిమి బంగారం ధర రికార్డు స్థాయిలో 2,956 డాలర్లను (సుమారు రూ.2.57 లక్షలు) తాకింది. ప్రస్తుతం...
రెండు నెలల్లోనే 12% పెరిగిన విలువ
అమెరికా, ఆస్ట్రేలియా ఈక్విటీ మార్కెట్లు దిగదుడుపు
అంతర్జాతీయ విపణిలో పసిడి ధర చుక్కలంటుతోంది. ఈ నెల ఒక దశలో ఔన్స్ (31.10 గ్రాములు) మేలిమి బంగారం ధర రికార్డు స్థాయిలో 2,956 డాలర్లను (సుమారు రూ.2.57 లక్షలు) తాకింది. ప్రస్తుతం 2,915 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. గత ఏడాది పసిడి పెట్టుబడులు మదుపరులకు 27 శాతం లాభాలు పంచాయి. గత 14 సంవత్సరాల్లో బంగారంపై పెట్టుబడులు ఈ స్థాయిలో లాభాలు అందించడం ఇదే ప్రథమం. 2025 సంవత్సరంలో తొలి రెండు నెలల కాలంలోనే పసిడిలో పెట్టుబడులు మదుపరులకు 12 శాతం వరకు లాభాలు పంచాయి. ఇదే సమయంలో అమెరికా, ఆస్ట్రేలియా స్టాక్ మార్కెట్లలో మదుపు చేసిన మదుపరులకు వచ్చిన లాభం రెండు నుంచి నాలుగు శాతం మాత్రమే. భారత స్టాక్ మార్కెట్ మాత్రం మదుపరులకు 4.64 శాతం నష్టాలు మిగిల్చింది. ఈ ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో ఔన్స్ పసిడి ధర త్వరలోనే అంతర్జాతీయ మార్కెట్‌లో 3,000 డాలర్లకు చేరుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి.
పసిడి పరుగుకు ప్రధాన కారణాలు :
ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి.
వెంటాడుతున్న ద్రవ్యోల్బణ భయాలు.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సుంకాల హెచ్చరికలు.
కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు.
డిమాండ్‌కు తగ్గట్టు పసిడి ఉత్పత్తి, సరఫరా లేకపోవడం.
స్టాక్ మార్కెట్ అనిశ్చితితో సురక్షిత పెట్టుబడిగా మారడం.
నగలతో పాటు పారిశ్రామిక రంగంలోనూ పసిడి వినియోగం పెరగడం.
రూపాయితో సహా ప్రధాన కరెన్సీలతో పెరుగుతున్న డాలర్ మారకం రేటు.
ఇవి కూడా చదవండి:
Maha Kumbh Mela 2025: మహా కుంభమేళా చివరిరోజు నాగ సాధువుల డ్రోన్ విజువల్స్.. తర్వాత మేళా ఎక్కడంటే..
Ashwini Vaishnaw: మన దగ్గర హైపర్ లూప్ ప్రాజెక్ట్ .. 300 కి.మీ. దూరం 30 నిమిషాల్లోనే..
Bank Holidays: మార్చి 2025లో బ్యాంకు సెలవులు.. ఈసారి ఎన్ని రోజులంటే..
Read More Business News and Latest Telugu News