Share News

Gold Price May Reach 5000 Dollars: వచ్చే ఏడాది 5000 డాలర్లకు గోల్డ్‌

ABN , Publish Date - Nov 28 , 2025 | 05:27 AM

బంగారం పరుగు ఇప్పట్లో ఆగదని ఇప్పటికే పలు ఆర్థిక సంస్థలు, విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. తాజాగా ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) సీఈఓ డేవిడ్‌ టైట్‌ కూడా ఇదే మాట అంటున్నారు...

Gold Price May Reach 5000 Dollars: వచ్చే ఏడాది 5000 డాలర్లకు గోల్డ్‌

డబ్ల్యూజీసీ సీఈఓ డేవిడ్‌ టైట్‌ అంచనా

దుబాయ్‌: బంగారం పరుగు ఇప్పట్లో ఆగదని ఇప్పటికే పలు ఆర్థిక సంస్థలు, విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. తాజాగా ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) సీఈఓ డేవిడ్‌ టైట్‌ కూడా ఇదే మాట అంటున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో, ఈ అక్టోబరులో 4,381 డాలర్ల వద్ద ఆల్‌టైం రికార్డు గరిష్ఠాన్ని నమోదు చేసిన ఔన్స్‌ (31.10 గ్రాములు) గోల్డ్‌ రేటు.. ప్రస్తుతం 4,150 డాలర్ల ఎగువన కదలాడుతోంది. మున్ముందు మరింత పెరిగి వచ్చే ఏడాదిలో 5,000 డాలర్లకు చేరుకోవచ్చని దుబాయ్‌లో జరిగిన ప్రీషియస్‌ మెటల్‌ కాన్ఫరెన్స్‌లో డేవిడ్‌ టైట్‌ అభిప్రాయపడ్డారు. ఫెడ్‌ రేట్ల తగ్గుదల, అమెరికా క్రమంగా ఆర్థిక సంక్షోభంలోకి కూరుకుపోతుండటం, సెంట్రల్‌ బ్యాంక్‌ల పసిడి కొనుగోళ్లు, జపాన్‌లో అధిక ద్రవ్యోల్బణం వంటి అంశాలు బులియన్‌ ధరలను మరింత ఎగదోయనున్నాయని ఆయన పేర్కొన్నారు. కాగా, గోల్డ్‌మన్‌ శాక్స్‌, జేపీ మోర్గాన్‌, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా వంటి అంతర్జాతీయ ఆర్థిక సేవల దిగ్గజాలు సైతం వచ్చే ఏడాదిలో గోల్డ్‌ 5,000 డాలర్లకు చేరుకోవచ్చని ఇదివరకే అంచనాలను విడుదల చేశాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

ప్రాణాలకు తెగించి నాగుపాముకు వైద్యం.. 2 గంటల పాటు..

మీకు తెలుసా.. రైలులో చేసే ఈ తప్పు వల్ల జైలు పాలవ్వడం ఖాయం..

Read Latest Telangana News and National News

Updated Date - Nov 28 , 2025 | 05:27 AM