Share News

Gold Price India 2025: కొత్త గరిష్ఠానికి బంగారం

ABN , Publish Date - Dec 16 , 2025 | 06:29 AM

పసిడి మళ్లీ కొండెక్కుతోంది. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (99.9 శాతం స్వచ్ఛత) బంగారం ధర సోమవారం రూ.4,000 పెరిగి సరికొత్త జీవితకాల గరిష్ఠ స్థాయి రూ.1,37,600కు చేరింది...

Gold Price India 2025: కొత్త గరిష్ఠానికి బంగారం

  • ఒక్కరోజులో రూ.4,000 జంప్‌

  • రూ.1.37 లక్షలకు 10 గ్రా. ధర

  • రూ.2 లక్షలకు కిలో వెండి రేటు

న్యూఢిల్లీ: పసిడి మళ్లీ కొండెక్కుతోంది. ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (99.9 శాతం స్వచ్ఛత) బంగారం ధర సోమవారం రూ.4,000 పెరిగి సరికొత్త జీవితకాల గరిష్ఠ స్థాయి రూ.1,37,600కు చేరింది. క్రితం గరిష్ఠ స్థాయి ధర రూ.1,34,800 ఈ అక్టోబరు 17న నమోదైంది. కాగా, కిలో వెండి మాత్రం గత వారాంతం ముగింపుతో పోలిస్తే ఏమార్పు లేకుండా రూ.1,99,500 ధర పలికింది. మన మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజీ (ఎంసీఎక్స్‌)లోనూ గోల్డ్‌ ఫ్యూచర్స్‌ 2026 ఫిబ్రవరి కాంట్రాక్టు ధర రూ.1,874 పెరుగుదలతో రూ.1,35,496 వద్ద కొత్త ఆల్‌టైమ్‌ రికార్డును నమోదు చేసింది. అంతర్జాతీయ మార్కెట్లో వీటి ధరలు మరింత ఎగబాకడంతో పాటు రూపా యి క్షీణత ఇందుకు ప్రధాన కారణమని బులియన్‌ విశ్లేషకులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ (31.10 గ్రాములు) గోల్డ్‌ 4,350 డాలర్లకు చేరుకోగా.. సిల్వర్‌ 63.96 డాలర్ల స్థాయిలో ట్రేడైంది. 2024 డిసెంబరు 31న రూ.78,950 పలికిన 10 గ్రాముల బంగారం.. ఈ ఏడాదిలో ఇప్పటివరకు రూ.58,650 లేదా 74.30 శాతం పెరిగింది. గత ఏడాది చివరి రోజున రూ.89,700గా నమోదైన కిలో వెండి రేటు.. 2025లో ఇప్పటివరకు రూ.1,09,800 లేదా 122.41 శాతం ఎగబాకింది.

ఇవీ చదవండి:

అంటార్కిటికాలో జాబ్.. రూ.1.3 కోట్ల జీతం.. వెళ్లాలా? వద్దా? యువకుడి డైలమా!

జాబ్ పోగొట్టుకున్న యువతి.. పనివేళల కంటే ముందే ఉద్యోగానికి వెళ్లి..

Updated Date - Dec 16 , 2025 | 06:29 AM