Share News

Gold Demand Declines: పసిడీలా

ABN , Publish Date - Oct 31 , 2025 | 06:09 AM

ధరలు రికార్డు స్థాయికి పెరగడంతో ఈ జూలై-సెప్టెంబరు త్రైమాసికం (క్యూ3)లో పసిడి గిరాకీ 16 శాతం తగ్గి 209.4 టన్నులకు పరిమితమైందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) గురువారం విడుదల చేసిన....

Gold Demand Declines: పసిడీలా

క్యూ3లో 16 శాతం తగ్గిన బంగారం గిరాకీ

  • ధరలు రికార్డు స్థాయికి పెరగడమే కారణం

  • పెట్టుబడి డిమాండ్‌లో 20 శాతం వృద్ధి

  • డబ్ల్యూజీసీ నివేదిక వెల్లడి

న్యూఢిల్లీ: ధరలు రికార్డు స్థాయికి పెరగడంతో ఈ జూలై-సెప్టెంబరు త్రైమాసికం (క్యూ3)లో పసిడి గిరాకీ 16 శాతం తగ్గి 209.4 టన్నులకు పరిమితమైందని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) గురువారం విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. గత ఏడాదిలో ఇదే కాలానికి డిమాండ్‌ 248.3 టన్నులుగా నమోదైంది. అయితే, అధిక ధరల కారణంగా ఈ క్యూ3లో బంగారం గిరాకీ విలువ వార్షిక ప్రాతిపదికన 23 శాతం పెరిగి రూ.2,03,240 కోట్లకు చేరిందని రిపోర్టు తెలిపింది. 2024లో ఇదే సమయానికిది రూ.1,65,380 కోట్లుగా ఉంది. డబ్ల్యూజీసీ నివేదికలో మరిన్ని విషయాలు..

  • ఈ క్యూ3లో బంగారం నగల గిరాకీ వార్షిక ప్రాతిపదికన 31 శాతం తగ్గి 117.7 టన్నులకు పడిపోయింది. డిమాండ్‌ విలువ మాత్రం దాదాపు గత ఏడాది స్థాయిలోనే (రూ.1,14,270 కోట్లుగా) నమోదైంది.

  • పసిడిలో పెట్టుబడుల డిమాండ్‌ పరిమాణం పరంగా 20 శాతం పెరిగి 91.6 టన్నులకు చేరుకోగా.. పెట్టుబడుల విలువ 74 శాతం పెరిగి రూ.88,970 కోట్లకు ఎగబాకింది.

  • గడిచిన మూడు నెలల్లో దేశంలోకి బంగారం దిగుమతులు 37 శాతం తగ్గి 194.6 టన్నులకు పరిమితమైంది. గత ఏడాదిలో ఇదే సమయానికి 308.2 టన్నులు దిగుమతైంది. పాత బంగారం పునర్‌ వినియోగం కూడా 7 తగ్గి 21.8 టన్నులుగా నమోదైంది.


క్యూ3 సగటు ధర రూ.97,074

గడిచిన మూడు నెలలకు బంగారం సగటు ధర (దిగుమతి సుంకం, జీఎ్‌సటీ మినహాయించి) రూ.97,074.9గా నమోదైంది. గత ఏడాదిలో ఇదే కాలానికి నమోదైన సగటు ధర రూ.66,614.1తో పోలిస్తే 46 శాతం పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్‌ గోల్డ్‌ సగటు రేటు 2,474.3 డాలర్ల నుంచి 3,456.5 డాలర్లకు పెరిగింది.

ఏడాది గిరాకీ 600-700 టన్నులు

ఈ సంవత్సరం మొత్తానికి పసడి గిరాకీ 600-700 టన్నుల స్థాయిలో నమోదు కావచ్చని డబ్ల్యూజీసీ అంచనా వేసింది. గడిచిన 9 నెలలకు (జనవరి-సెప్టెంబరు) డిమాండ్‌ 462.4 టన్నులుగా ఉంది.

ప్రపంచవ్యాప్త గిరాకీ 1,313 టన్నులు

ఈ జూలై-సెప్టెంబరు కాలానికి ప్రపంచవ్యాప్తంగా పసిడి డిమాండ్‌ రికార్డు స్థాయిలో 1,313 టన్నులకు పెరిగింది. ఆయా దేశాల సెంట్రల్‌ బ్యాంక్‌లు జోరుగా పసిడి కొనుగోలు చేయడం, ఆర్థిక అనిశ్చితుల నేపథ్యంలో ఈ విలువైన లోహంలోకి రికార్డు స్థాయిలో పెట్టుబడులు వచ్చి చేరడం ఇందుకు కారణం.

క్యూ4లో బలమైన గిరాకీ

దీర్ఘకాలంలో విలువ పెంచేదిగా బంగారంపై భారత వినియోగదారులకు ఉన్న నిబద్ధతను తాజా గణాంకాలు నొక్కి చెబుతున్నాయి. క్యూ3లో గిరాకీ పరిమాణం 16ు తగ్గినా, విలువపరంగా 23ు పెరగడాన్ని విస్మరించలేం. భారత వినియోగదారుల తలసరి ఆదాయంతో పాటు ఖర్చు పెట్టే స్థోమత కూడా క్రమంగా పెరుగుతోంది. దీపావళి సీజన్‌లో బంగారం విక్రయాలు భారీగా జరిగాయని విక్రేతల నుంచి సంకేతాలందుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్‌ కూడా ఉన్నందున నాలుగో త్రైమాసికం (అక్టోబరు-డిసెంబరు)లో బలమైన గిరాకీ నమోదు కానుందని ధీమాగా ఉన్నాం.

సచిన్‌ జైన్‌,

రీజినల్‌ సీఈఓ, డబ్ల్యూజీసీ ఇండియా

ఈ వార్తలు కూడా చదవండి..

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్.. రాష్ట్రపతి ఉత్తర్వులు

జగన్‌కు మంత్రి అచ్చెన్నాయుడు చాలెంజ్

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 31 , 2025 | 06:09 AM