Gold Rates Today: పసిడి కొనుగోలు చేయాలా.. నేటి రేట్లు ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Mar 04 , 2025 | 07:34 AM
నేడు బంగారం ధరలు స్వల్పంగా పెరిగినా దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇది తగిన సమయమని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. మరి నేడు బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఇంటర్నెట్ డెస్క్: సురక్షిత పెట్టుబడి సాధనంగా పసిడికి ప్రపంచవ్యాప్తంగా పేరుంది. ఇక భారతీయుల దృష్టిలో బంగారానికి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కూడా ఉంది. ఫలితంగా భారత్‌లో బంగారానికి ఎల్లప్పుడు మంచి డిమాండ్ ఉంటుంది. ఇక స్టాక్ మార్కెట్‌లల్లో హెచ్చుతగ్గుల కారణంగా అనేక మంది పసిడిపై పెట్టుబడి పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. భారత్‌లో గత కొన్ని రోజులుగా పసిడి ధరలు హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో 10 గ్రాముల 24 క్యారెట్ బంగారం ధర రూ. 85,690గా ఉంది. వెండి ధర కిలో రూ.96,100. మునుపటితో పోలిస్తే ధరలు స్వల్పంగా పెరిగాయి.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం (24కే, 22కే) ధరలు
న్యూఢిల్లీ: రూ.85,390; రూ.78,274
ముంబై: రూ.85,540; రూ.78,412
కోల్‌కతా: రూ.85,420; రూ.78,302
చెన్నై: రూ.85,790; రూ.78,641
బెంగళూరు: రూ.85,600; రూ.78,467
హైదరాబాద్: రూ.85,670; రూ.78,531
అహ్మదాబాద్: రూ.85,650; రూ.78,513
ఇక సమీప కాలంలో బంగారం ధరలు పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మధ్యలో హెచ్చుతగ్గులు కనిపించినా స్థూలంగా ధరల్లో పెరుగుదల ట్రెండ్ కనిపిస్తోందని అంటున్నాయి. కాబట్టి, దీర్ఘకాలిక పెట్టుబడుల పెట్టాలనుకునే వారు బంగారంపై ఇన్వెస్ట్ చేసేందుకు ఇది తగిన సమయమని చెబుతున్నారు. అయితే, స్వల్పకాలిక పెట్టుబడుల కోసం చూసే వారికి మాత్రం రూ.86 వేల వద్ద ధరలు కాస్త హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశం ఉంది. కాబట్టి, ఇలాంటి వారు మరి కొన్ని రోజులు వేచి చూడటం మంచిదని అంటున్నారు.