Gold Rates on Oct 28: బంగారానికి తగ్గిన డిమాండ్.. ధరల్లో కోత
ABN , Publish Date - Oct 28 , 2025 | 06:40 AM
అంతర్జాతీయ వాణిజ్యంలో తొలగుతున్న అనిశ్చిత పరిస్థితులతో బంగారానికి డిమాండ్ తగ్గుతోంది. మదుపర్లు లాభాల స్వీకరణకు కూడా దిగడంతో ధరల్లో కరెక్షన్ చోటుచేసుకుంటోంది. దీంతో, బంగారం, వెండి ధరలు తగ్గుతున్నాయి. మరి నేటి రేట్స్ ఎలా ఉన్నాయో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: బంగారానికి డిమాండ్ తగ్గుతుండటంతో ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. ఈ వారంలో ఇప్పటివరకూ బంగారం ధరలు సుమారు 8 శాతం మేర పతనమయ్యాయి. ద్రవ్యోల్బణంలో తగ్గుదల, అమెరికా-చైనా వాణిజ్య చర్చల్లో పురోగతి, డాలర్ అంతకంతకూ బలపడుతుండటంతో పాటు గోల్డ్ మార్కెట్స్‌లో మదుపర్ల లాభాల స్వీకరణ.. పసిడి ధరలు దిగొచ్చేలా చేస్తున్నాయి.
గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, మంగళవారం ఉదయం 6.30 గంటలకు దేశంలో బంగారం ధరలు రూ.1.25 లక్షల మార్కు దిగువకు చేరుకున్నాయి. 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,23,270గా ఉంది. 22 క్యారెట్ 10 గ్రాముల ఆర్నమెంటల్ గోల్డ్ ధర రూ.1,12,990కు తగ్గింది. 18 క్యారేట్ గోల్డ్ ధర రూ.92,450గా ఉంది. వెండి ధరల్లో కూడా స్వల్ప తగ్గుదల కనిపించింది. కిలో వెండి ధర ప్రస్తుతం రూ.1,54,900గా ఉంది (Gold, Silver Prices on Oct 28).
అంతర్జాతీయంగా కూడా పసిడి ధరల్లో తగ్గుదల నమోదైంది. ప్రస్తుతం ఔన్స్ మేలిమి బంగారం ధర 4,010 డాలర్లుగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక స్థితిగతులు మరింతగా మెరుగుపడే కొద్దీ బంగారం ధరలు మరింత తగ్గే ఛాన్స్ ఉందని నిపుణులు చెబుతున్నారు.
దేశంలో బంగారం ధరలు (24కే, 22కే, 18కే) ఇలా
చెన్నై: ₹1,24,900; ₹1,14,490; ₹95,740;
ముంబై: ₹1,23,270; ₹1,12,990; ₹92,450;
దిల్లీ: ₹1,23,420; ₹1,13,140; ₹92,600;
కోల్‌కతా: ₹1,23,270; ₹1,12,990; ₹92,450;
బెంగళూరు: ₹1,23,270; ₹1,12,990; ₹92,450;
హైదరాబాద్: ₹1,23,270; ₹1,12,990; ₹92,450;
కేరళ: ₹1,23,270; ₹1,12,990; ₹92,450;
పూణె: ₹1,23,270; ₹1,12,990; ₹92,450;
వడోదరా: ₹1,23,320; ₹1,13,040; ₹92,500;
అహ్మదాబాద్: ₹1,23,320; ₹1,13,040; ₹92,500;
వెండి (కిలో) ధరలు
చెన్నై: ₹1,69,900;
ముంబై: ₹1,54,900;
దిల్లీ: ₹1,54,900;
కోల్‌కతా: ₹1,54,900;
బెంగళూరు: ₹1,56,900;
హైదరాబాద్: ₹1,69,900;
కేరళ: ₹1,69,900;
పూణె: ₹1,54,900;
వడోదరా: ₹1,54,900;
అహ్మదాబాద్: ₹1,54,900;
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. వార్త రాస్తున్న సమయానికి ధరల వివరాలు పైన తెలిపిన విధంగా ఉన్నాయి. కాబట్టి బంగారం కొనుగోలు చేసే ముందు.. ధరలు మళ్లీ ఒకసారి పరిశీలించుకోగలరు.
ఇవీ చదవండి:
ప్రభుత్వ బ్యాంకుల్లోకి 49శాతం విదేశీ పెట్టుబడులు
Sensex Rise: సెన్సెక్స్ 567 పాయింట్లు అప్
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి