Gold And Silver Rate: పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు..
ABN , Publish Date - Jun 02 , 2025 | 06:27 AM
Gold And Silver Rate: నగరంలో నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 89,200 రూపాయలు..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 97,310 రూపాయలు.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 72,990 రూపాయలుగా ఉండింది.
ఈ సంవత్సరం బంగారం ధరలు ఊహించని విధంగా పెరిగాయి. జనవరి నుంచి మార్చి మధ్య కాలంలో స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర విపరీతంగా పెరుగుతూ వెళ్లింది. ఏప్రిల్ మొదటి వారంలో ఏకంగా లక్ష రూపాయలకు చేరింది. బంగారం కొనాలనుకునే పేద, మధ్య తరగతి వారికి షాక్ ఇచ్చింది. అయితే, భారత్, పాకిస్తాన్ యుద్ధం సమయంలో బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల బంగారం ధర లక్ష రూపాయల నుంచి ఏకంగా 96 వేలకు పడిపోయింది. ఇప్పుడిప్పుడే మళ్లీ పెరుగుతూ ఉంది. 98 వేల దగ్గర ట్రేడ్ అవుతోంది. ఇక, నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి.
హైదరాబాద్‌లో బంగారం ధరలు ఇలా..
నగరంలో నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 89,200 రూపాయలు..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 97,310 రూపాయలు.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 72,990 రూపాయలుగా ఉండింది. నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాముల బంగారంపై.. గ్రాముకు ఒక రూపాయి చొప్పున 10 రూపాయలు తగ్గింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 97,300 రూపాయలు.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 89,190 రూపాయలు..10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర .. 72,980 రూపాయలుగా ఉంది.
వెండి ధరలు ఇలా ..
బంగారం ధరలతో సంబంధం లేకుండా వెండి ధరలు ప్రతీ రోజు ఎంతో కొంత తగ్గుతూ వస్తున్నాయి. నిన్న హైదరాబాద్ నగరంలో 100 గ్రాముల వెండి ధర 11,090 దగ్గర ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 1,10,900 దగ్గర ట్రేడ్ అయింది. ఈ రోజు 100 గ్రాముల వెండిపై 10 రూపాయలు, కేజీ వెండిపై 100 రూపాయలు తగ్గింది. 100 గ్రాముల వెండి ధర నేడు 11,080 దగ్గర ట్రేడ్ అవుతోంది. కేజీ వెండి ధర 1,10,800 దగ్గర ట్రేడ్ అవుతోంది.
ఇవి కూడా చదవండి
కామాఖ్య దేవిపై వివాదాస్పద వ్యాఖ్యలు