Share News

Gold And Silver Rate: రోజు రోజుకు పెరుగుతున్న బంగారం ధరలు

ABN , Publish Date - Jul 03 , 2025 | 07:29 AM

Gold And Silver Rate: నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90,650 రూపాయల దగ్గర..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 98,890 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 74,170 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది.

Gold And Silver Rate: రోజు రోజుకు పెరుగుతున్న బంగారం ధరలు
Gold And Silver Rate

బంగారం కొనాలనుకునే వారికి వరుస షాక్‌లు తగులుతున్నాయి. గత వారం రోజుల నుంచి బంగారం ధరలు పెరుగుతున్నాయే తప్ప తగ్గటం లేదు. వారం క్రితం స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర 93 వేల దగ్గర ట్రేడ్ అయింది. వారం రోజుల్లోనే ఊహించని విధంగా .. 98 వేలకు చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్లో కొనసాగుతున్న పరిస్థితులు చూస్తుంటే బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. బంగారం కొనాలనుకునే వారు ముందుగానే జాగ్రత్త పడాలని, ధరలు తగ్గినపుడు కొని పెట్టుకోవటం ఉత్తమమని ట్రేడ్ నిపుణులు సూచిస్తున్నారు.


భాగ్య నగరంలో బంగారం ధరల వివరాలు..

హైదరాబాద్ నగరంలో నిన్న 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90,650 రూపాయల దగ్గర..10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 98,890 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర 74,170 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది. నిన్నటితో పోల్చుకుంటే పది గ్రాముల బంగారంపై.. గ్రాముకు ఒక రూపాయి చొప్పున 10 రూపాయలు పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 98,900 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 90,660 రూపాయల దగ్గర.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర .. 74,180 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతోంది.


నగరంలో వెండి ధరలు ఇలా ..

మొన్నటి వరకు బంగారం ధరలు తగ్గినా వెండి ధరలు మాత్రం పెరుగుతూ పోయాయి. కానీ, ఈ రోజు వెండి ధరలు తగ్గాయి. నిన్న హైదరాబాద్ నగరంలో 100 గ్రాముల వెండి ధర 12000 దగ్గర ట్రేడ్ అయింది. కేజీ వెండి ధర 1,20,000 దగ్గర ట్రేడ్ అయింది. ఈ రోజు 100 గ్రాముల వెండిపై 10 రూపాయలు, కేజీ వెండిపై 100 రూపాయలు తగ్గింది. 100 గ్రాముల వెండి ధర నేడు 11990 దగ్గర ట్రేడ్ అవుతోంది. కేజీ వెండి ధర 1,19,900 దగ్గర ట్రేడ్ అవుతోంది.


ఇవి కూడా చదవండి

అపురూప దృశ్యం.. శివుడికి అభిషేకం చేసిన గంగమ్మ

10న రెండో విడత తల్లికి వందనం

Updated Date - Jul 03 , 2025 | 07:31 AM