Gold Rate on Nov 3: నిలకడగా బంగారం ధరలు.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..
ABN , Publish Date - Nov 03 , 2025 | 06:42 AM
ప్రస్తుతం దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. మరి వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో బంగారం ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. గుడ్ రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం, నేటి ఉదయం 6.30 గంటల సమయంలో దేశంలో 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,990గా ఉంది. ఇక 22 క్యారెట్ బంగారం ధర రూ.1,12,740 కాగా 18 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ.92,240గా నిలిచింది. హైదరాబాద్, విజయవాడలో పసిడి ధరలు ఇదే స్థాయిలో ఉన్నాయి. మరోవైపు, దేశంలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,51,900గా ఉంది. హైదరాబాద్, విజయవాడల్లో మాత్రం కిలో వెండి రూ.1,65,900 వద్ద తచ్చాడుతోంది (Gold Rates on Nov 3).
అంతర్జాతీయ మార్కెట్‌లో గత వారం 24 క్యారెట్ ఔన్స్ (31.10 గ్రాములు) పసిడి ధర 4,002 డాలర్ల వద్ద తచ్చాడుతోంది. అయితే, ధరలు 4,200 డాలర్లకు చేరే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సాంకేతిక కారణాలు మినహా బంగారం ధర తగ్గడానికి ప్రత్యేక కారణాలు ఏమీ లేవని చెబుతున్నారు. బంగారానికి మౌలిక డిమాండ్ అలాగే ఉందని చెబుతున్నారు. మదుపర్లతో పాటు సెంట్రల్ బ్యాంకులు కూడా బంగారంపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతుండటంతో ధరలు పెరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయని చెబుతున్నారు.
దేశంలో వివిధ నగరాల్లో ప్రస్తుతం పసిడి ధరలు ఇవీ
చెన్నై: ₹1,23,370; ₹1,13,090; ₹94,340
ముంబై: ₹1,22,990; ₹1,12,740; ₹92,240
ఢిల్లీ: ₹1,23,140; ₹1,12,890; ₹92,390
కోల్‌కతా: ₹1,22,990; ₹1,12,740; ₹92,240
బెంగళూరు: ₹1,22,990; ₹1,12,740; ₹92,240
హైదరాబాద్: ₹1,22,990; ₹1,12,740; ₹92,240
విజయవాడ: ₹1,22,990; ₹1,12,740; ₹92,240
కేరళ: ₹1,22,990; ₹1,12,740; ₹92,240
పూణె: ₹1,22,990; ₹1,12,740; ₹92,240
వడోదరా: ₹1,23,040; ₹1,12,790; ₹92,290
అహ్మదాబాద్: ₹1,23,040; ₹1,12,790; ₹92,290
కిలో వెండి ధరలు ఇలా
చెన్నై: ₹1,65,900
ముంబై: ₹1,51,900
ఢిల్లీ: ₹1,51,900
కోల్‌కతా: ₹1,51,900
బెంగళూరు: ₹1,51,900
హైదరాబాద్: ₹1,65,900
విజయవాడ: ₹1,65,900
కేరళ: ₹1,65,900
పూణె: ₹1,51,900
వడోదరా: ₹1,51,900
అహ్మదాబాద్: ₹1,51,900
గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. వార్త రాస్తున్న సమయానికి ధరల వివరాలు పైన తెలిపిన విధంగా ఉన్నాయి. కాబట్టి బంగారం కొనుగోలు చేసే ముందు.. ధరలు మళ్లీ ఒకసారి పరిశీలించుకోగలరు.
ఇవీ చదవండి:
ఆరోగ్య బీమా తీసుకుంటున్నారా.. ఈ విషయాల్లో జాగ్రత్త
India Auto Industry: వాహన విక్రయాల్లో రికార్డు
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి