Gold and Silver Prices: గుడ్‌న్యూస్.. భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు..
ABN , Publish Date - Dec 30 , 2025 | 06:27 PM
గుడ్‌న్యూస్.. బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయనే అంచనాలు, వెండిపై చైనా ఎగుమతి ఆంక్షల నేపథ్యంలో ఈ విలువైన లోహాల ధరలు భారీగా తగ్గాయి.
ఏడాది కాలంగా భారీ స్థాయిలో పెరుగుతూ వస్తున్న పసిడి, వెండి ధరల్లో మంగళవారం గణనీయమైన దిద్దుబాటు కనిపించింది. అంతర్జాతీయంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పడతాయనే అంచనాలు, వెండిపై చైనా ఎగుమతి ఆంక్షల నేపథ్యంలో ఈ విలువైన లోహాల ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయంగా కమొడిటీ మార్కెట్లలో మదుపర్లు లాభాలు స్వీకరించడం కూడా వెండి ధరలు తగ్గడానికి కారణంగా కనబడుతోంది (precious metals price decline).
సోమవారంతో పోల్చుకుంటే మంగళవారం వెండి ధర కిలోకు ఏకంగా రూ.18 వేలు పడిపోయింది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2.58 లక్షలుగా ఉంది. సోమవారం ఉదయం హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.2.8 లక్షలు పలికింది. ఇక, దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర ప్రస్తుతం రూ.2.4 లక్షలుగా ఉంది. అంతర్జాతీయంగా వెండిలో దిద్దుబాటు జరగడమే దీనికి కారణంగా కనిపిస్తోంది (silver price fall).
మరోవైపు బంగారం కూడా చెప్పుకోదగిన స్థాయిలో కిందకు దిగి వచ్చింది (gold price drop). మంగళవారం పది గ్రాముల బంగారం ధర రూ.3 వేలకు పైగానే తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ప్రస్తుతం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1, 36, 200గా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1, 24, 850గా ఉంది. మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1, 36, 350గా ఉంది. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1, 25, 000గా ఉంది.
ఇవి కూడా చదవండి..
బ్లింకిట్ డెలివరీ బాయ్‌కు సలాం చెప్పాల్సిందే.. పెళ్లి వేదిక దగ్గరకు వచ్చి ఏం చేశాడంటే..
మీ కళ్లు పవర్‌ఫుల్ అయితే.. ఈ ఫొటోలో నాలుగో పిల్లిని 7 సెకెన్లలో కనిపెట్టండి..