Global Markets: గ్లోబల్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు
ABN , Publish Date - Nov 24 , 2025 | 01:17 AM
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం మిశ్రమంగా కదలాడవచ్చు. క్రితం వారం ప్రారంభంలో రాణించిన సూచీలు గ్లోబల్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల తో ఆఖరిలో చతికిలపడ్డాయి...
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారం మిశ్రమంగా కదలాడవచ్చు. క్రితం వారం ప్రారంభంలో రాణించిన సూచీలు గ్లోబల్ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాల తో ఆఖరిలో చతికిలపడ్డాయి. రూపాయి పతనం, యెన్, డాలర్ బాండు రాబడుల పెరుగుదల, అనిశ్చితి, యూఎస్ ఫెడ్ నిర్ణయాలు కీలకమవుతాయి. ప్రస్తుతం ఐటీ, ఆటో, ఫార్మా, ఫైనాస్స్ రంగాల షేర్లు జోరు ప్రదర్శిస్తున్నాయి.
స్టాక్ రికమెండేషన్స్
ఎస్‌బీఐ కార్డ్: ప్రస్తుతం ఈ షేర్లు మధ్యకాలిక అప్‌ట్రెండులో ఉన్నాయి. తాజా ఫలితాల తర్వాత 12ు వరకు దిద్దుబాటుకు లోనయ్యాయి. కీలకమైన రూ.880 స్థాయిలో మరోసారి మద్దతు లభించింది. గత శుక్రవారం రూ.878 వద్ద ముగిసిన ఈ కౌంటర్లో మదుపరులు రూ.990 టార్గెట్ ధరతో రూ.850పై స్థాయిలో పొజిషన్ తీసుకోవచ్చు. స్టాప్‌లాస్ : రూ.830.
ఐటీసీ: గత ఏడాది సెప్టెంబరు నుంచి ఈ షేర్లు దాదాపుగా 20ు మేర కుంగాయి. కీలక మద్దతు స్థాయి రూ.400కి చేరడంతో టర్న్ అరౌండ్ సూచనలు కనిపిస్తున్నాయి. గత శుక్రవారం రూ.407 వద్ద ముగిసిన ఈ కౌంటర్లో ఇన్వెస్టర్లు రూ.455/470 టార్గెట్ ధరతో రూ.400పై స్థాయిలో ప్రవేశించవచ్చు. స్టాప్‌లాస్ : రూ.385.
టెక్ మహీంద్రా: ప్రస్తుతం ఐటీ రంగం టర్న్ అరౌండ్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో టెక్ మహీం ద్రా షేర్లపై ఆసక్తి పెరిగింది. 52 వారాల గరిష్టం నుంచి 25ు మేర పతనమైన ఈ షేర్లలో ఇప్పుడిప్పుడే మూమెంటమ్ పెరుగుతోంది. గత శుక్రవారం రూ.1461 వద్ద ముగిసిన ఈ కౌంటర్లో ఇన్వెస్టర్లు రూ.1650 టార్గెట్ ధరతో రూ.1450 పై స్థాయిలో పొజిషన్లు తీసుకోవచ్చు. స్టాప్‌లాస్ : రూ. 1420.
హెచ్‌డీఎ్‌ఫసీ లైఫ్: ఈ షేర్లలో గరిష్ఠ స్థాయుల్లో కన్సాలిడేషన్ కొనసాగుతోంది. మరోసారి ఇవి 10, 20, 50 డిఎంఏల పైన మద్దతు తీసుకున్నాయి. రిలేటివ్ స్ట్రెంత్ సైతం క్రమంగా పెరుగుతోంది. గత శుక్రవారం రూ.764 వద్ద ముగిసిన ఈ కౌంటర్లో మదుపరులు రూ.820 టార్గెట్ ధరతో రూ.750 శ్రేణిలో ప్రవేశించాలి. స్టాప్‌లాస్ : రూ.730
ఎస్కార్ట్స్: ఈ షేర్లు మధ్యకాలిక అప్‌ట్రెండ్‌లో కన్సాలిడేషన్ ట్రెండ్‌లో కొనసాగుతున్నాయి. వాల్యూమ్ తక్కువగా నమోదవ్వడాన్ని బట్టి ఇన్వెస్టర్ల ఆసక్తి కనిపిస్తోంది. గత శుక్రవారం రూ.3617 వద్ద ముగిసిన ఈ కౌంటర్లో మదుపరులు రూ.3850 టార్గెట్ ధరతో రూ.3600 పై స్థాయిలో పొజిషన్ తీసుకోవాలి. స్టాప్‌లాస్ : రూ. 3565.
మూర్తి నాయుడు పాదం,
మార్కెట్ నిపుణులు, నిఫ్టీ మాస్టర్
+91 98855 59709
నోట్ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.
ఇవీ చదవండి:
అన్‌క్లెయిమ్డ్ బీమా మొత్తాలు క్లెయిమ్ చేసుకోవడం ఎలా
అమెజాన్‌లో భారీ లే ఆఫ్స్.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల పైనే ఎక్కువ ఎఫెక్ట్..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి