Share News

ఈ ఏడాది రూ.200 కోట్ల ప్రీమియం ఆదాయం లక్ష్యం

ABN , Publish Date - May 13 , 2025 | 03:22 AM

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.200 కోట్ల ప్రీమియం ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు గెలాక్సీ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ, సీఈఓ జీ శ్రీనివాసన్‌ వెల్లడించారు. సోమవారం నాడిక్కడ...

ఈ ఏడాది రూ.200 కోట్ల ప్రీమియం ఆదాయం లక్ష్యం

గెలాక్సీ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ శ్రీనివాసన్‌

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.200 కోట్ల ప్రీమియం ఆదాయాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు గెలాక్సీ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ, సీఈఓ జీ శ్రీనివాసన్‌ వెల్లడించారు. సోమవారం నాడిక్కడ సంస్థ రీజినల్‌ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది అక్టోబరులో గెలాక్సీ హెల్త్‌ కార్యకలాపాలు ఆరంభం కాగా ప్రీమియం ఆదాయం రూ.17 కోట్లుగా ఉందన్నారు. కార్యకలాపాలు ప్రారంభించిన కొద్ది నెలల్లోనే 68 వేల మందికి పైగా పాలసీదారులను చేర్చుకున్నట్లు ఆయన చెప్పారు. ప్రస్తుతం గెలాక్సీ హెల్త్‌ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో సేవలందిస్తుండగా వచ్చే మార్చి నాటికి మరో ఐదు రాష్ట్రాలకు విస్తరించాలని చూస్తున్నట్లు శ్రీనివాసన్‌ తెలిపారు. ప్రస్తుతం ఏడు ఆరోగ్య బీమా ఉత్పత్తులను విక్రయిస్తుండగా ఈ ఏడాది మరో 10 కొత్త ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఆయన చెప్పారు. కాగా ఏపీ, తెలంగాణల్లో కార్యకలాపాలను మరింత పటిష్ఠం చేసేందుకు మరో 14 కార్యాలయాలను ప్రారంభించాలని చూస్తున్నట్లు ఆయన చెప్పారు.


అలాగే 10 వేల మంది ఏజెంట్లను చేర్చుకోనున్నట్లు ఆయన చెప్పారు. కాగా బీమా ఉత్పత్తుల విక్రయానికి బ్యాంకులతో ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు శ్రీనివాసన్‌ తెలిపారు.

ఇవి కూడా చదవండి

Paytm: పేటీఎంకు మరో దెబ్బ..సంస్థలో 4 శాతం వాటా సేల్ చేస్తున్నారా..

Penny Stock: ఈ స్టాక్‎పై రూ.4 లక్షల పెట్టుబడి..ఏడేళ్ల లోనే రూ.56 లక్షల లాభం..

Investment Tips: ఒకేసారి రూ.3.5 లక్షల పెట్టుబడి..కానీ వచ్చేది మాత్రం కోటి, ఎలాగంటే..

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 13 , 2025 | 03:22 AM