Share News

Indian Stock Market: ఎఫ్‌పీఐల రికార్డు స్థాయి అమ్మకాలు

ABN , Publish Date - Dec 29 , 2025 | 05:09 AM

భారత స్టాక్‌ మార్కెట్లో విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) అమ్మకాల హోరు కొనసాగుతోంది. ఈ ఏడాది ఈ సంస్థల అమ్మకాలు...

Indian Stock Market: ఎఫ్‌పీఐల రికార్డు స్థాయి అమ్మకాలు

న్యూఢిల్లీ: భారత స్టాక్‌ మార్కెట్లో విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్‌పీఐ) అమ్మకాల హోరు కొనసాగుతోంది. ఈ ఏడాది ఈ సంస్థల అమ్మకాలు ఇప్పటి వరకు రూ.1.58 లక్షల కోట్ల రికార్డు స్థాయికి చేరాయి. ఎఫ్‌పీఐలు గతంలో ఎన్నడూ మన స్టాక్‌ మార్కెట్లో ఇంత భారీ స్థాయిలో అమ్మకాలకు దిగలేదు. అయితే ఇదే సమయంలో ఈ సంస్థలు దేశీయ రుణ పత్రాల్లో మాత్రం రూ.59,000 కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టాయి. డాలర్‌తో రూపాయి పతనం, భారత-అమెరికా వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితితో ఎఫ్‌పీఐలు పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నాయి.

ఇవీ చదవండి

ఈ విషయాలు తెలుసా? పర్సనల్ లోన్ చెల్లించకుండానే రుణగ్రహీత మరణిస్తే..

మ్యూచువల్‌ ఫండ్స్‌ లాభాలపై పన్ను పోటు ఎంత

Updated Date - Dec 29 , 2025 | 05:09 AM