Share News

Arunachalam Vellayan: మురుగప్పా గ్రూప్‌ మాజీ చైర్మన్‌ అరుణాచలం కన్నుమూత

ABN , Publish Date - Nov 18 , 2025 | 06:12 AM

మురుగప్పా గ్రూప్‌ మాజీ చైర్మన్‌, కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ గౌరవ చైర్మన్‌ అరుణాచలం వెల్లాయన్‌ (72) మరిక లేరు. దీర్ఘకాలంగా అస్వస్థతతో ఉన్న ఆయన సోమవారం..

Arunachalam Vellayan: మురుగప్పా గ్రూప్‌ మాజీ చైర్మన్‌ అరుణాచలం కన్నుమూత

న్యూఢిల్లీ: మురుగప్పా గ్రూప్‌ మాజీ చైర్మన్‌, కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ గౌరవ చైర్మన్‌ అరుణాచలం వెల్లాయన్‌ (72) మరిక లేరు. దీర్ఘకాలంగా అస్వస్థతతో ఉన్న ఆయన సోమవారం ఉదయం కన్నుమూసినట్టు మురుగప్ప గ్రూప్‌ ఒక ప్రకటనలో తెలిపింది. దక్షిణ భారతదేశంలో మురుగప్పా గ్రూప్‌ను ప్రముఖ పారిశ్రామిక సంస్థగా తీర్చిదిద్దడంలో అరుణాచలం కీలక పాత్ర పోషించారు. వివిధ వ్యాపారాల్లోకి విస్తరించిన మురుగప్పా గ్రూప్‌నకు వ్యూహాత్మక మార్గదర్శనం చేయడంలోనూ ఆయనది కీలక పాత్ర. ఆయన నేతృత్వంలో మురుగప్పా దేశంలోని అత్యంత విశ్వసనీయ పారిశ్రామిక గ్రూపుల్లో ఒకటిగా స్థానం సంపాదించుకుంది. మురుగప్పా గ్రూప్‌ కంపెనీలతో పాటు కనోరియా కెమికల్స్‌, ఎగ్జిమ్‌ బ్యాంక్‌, ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ బోర్డుల్లోనూ ఆయన డైరెక్టర్‌గా వ్యవహరించారు.

ఇవి కూడా చదవండి:

అమెరికాలో నిపుణులైన వర్కర్ల కొరత ఉంది.. ఫోర్డ్ సీఈఓ ఆందోళన

అమెరికాలో భారీ స్థాయిలో ఉద్యోగాల్లో కోతలు.. సంచలన నివేదికలో వెల్లడి

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 18 , 2025 | 06:12 AM