RBI Udgam Portal: బ్యాంకు ఖాతాలో సొమ్ము మరిచిపోయారా
ABN , Publish Date - Nov 09 , 2025 | 06:04 AM
మనలో చాలా మందికి బ్యాంకుల్లో పొదుపు ఖాతా (ఎస్‌బీ), కరెంట్ ఖాతాలు లేదా టర్మ్ డిపాజిట్లు ఉంటాయి. కొంతమంది తమ ఖాతాలను రెగ్యులర్‌గా నిర్వహిస్తుంటారు. మరికొంత మంది వాటిని సరిగా నిర్వహించరు....
రీక్లెయిమ్ చేసుకోండి ఇలా..
మనలో చాలా మందికి బ్యాంకుల్లో పొదుపు ఖాతా (ఎస్‌బీ), కరెంట్ ఖాతాలు లేదా టర్మ్ డిపాజిట్లు ఉంటాయి. కొంతమంది తమ ఖాతాలను రెగ్యులర్‌గా నిర్వహిస్తుంటారు. మరికొంత మంది వాటిని సరిగా నిర్వహించరు.. లేదంటే ఏదో ఒక కారణంతో మర్చిపోతారు. ఒక్కోసారి ఖాతాదారుడు లేదా డిపాజిటర్ చనిపోతే వారి వారసులకు వాటి వివరాలు తెలియక పోవచ్చు. ఇలాంటి సందర్భాల్లోనూ మరుగున పడిన ఈ ఖాతాలు, డిపాజిట్లలోని డబ్బులు తిరిగి క్లెయిమ్ చేసుకోవచ్చు. అదెలాగో తెలుసుకుందాం.
బ్యాంకుల్లో క్లెయిమ్ చేయని డిపాజిట్లు ఏటేటా పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది జూన్ నాటికి ఈ మొత్తం రూ.67,000 కోట్లకు చేరింది. దీంతో ఈ మొత్తాన్ని వాటి అసలు ఖాతాదారులు లేదా వారి వారసులకు అప్పగించేందుకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) చర్యలు చేపట్టింది. ఇందుకోసం అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్స్-గేట్‌వే టు యాక్సెస్ ఇన్ఫర్మేషన్ (ఉద్గమ్) పేరుతో ఒక ప్రత్యేక పోర్టల్ ఏర్పాటు చేసింది. ఈ పోర్టల్ ద్వారా బ్యాంకు ఎస్‌బీ/కరెంట్ అకౌంట్ ఖాతాదారులు లేదా టర్మ్ డిపాజిటర్లు లేదా వారి వారసులు ఆ ఖాతాల్లోని మొత్తాలను తిరిగి క్లెయిమ్ చేసుకోవచ్చు.
పదేళ్ల పాటు నిర్వహణలో లేకపోతేనే..
బ్యాంకులోని ఏదైనా ఒక ఎస్‌బీ/కరెంట్ ఖాతాను పదేళ్ల పాటు ఆపరేట్ చేయకపోతే బ్యాంకులు దాన్ని ఇన్‌ఆపరేటివ్ ఖాతాగా పరిగణించి ఆ ఖాతాలోని మొత్తాన్ని ఆర్‌బీఐ నిర్వహించే డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ (డీఈఏ) ఫండ్‌కు బదిలీ చేస్తాయి. గడువు దాటిన పదేళ్లలోపు వెనక్కి తీసుకోని టర్మ్ డిపాజిట్లను కూడా అన్‌క్లెయిమ్‌డ్ డిపాజిట్లుగా పరిగణించి డీఈఏ ఫండ్‌కు మళ్లిస్తారు. ఠఛీజ్చఝ.టఛజీ.ౌటజ.జీుఽ పోర్టల్‌కు లాగిన్ అయి అవసరమైన వివరాలు సమర్పించడం ద్వారా ఈ ఖాతాల్లోని బ్యాలెన్స్ లేదా డిపాజిట్ల మొత్తాన్ని ఖాతాదారులు లేదా వారి వారసులు పొందవచ్చు.
డీఈఏ ఫండ్‌కు చేరే ఖాతాల సొమ్ము
పదేళ్లుగా ఆపరేట్ చేయని లేదా గడువు ముగిసి పదేళ్లయినా క్లెయిమ్ చేయని ఈ కింది ఖాతాల్లోని సొమ్ము డీఈఏ ఫండ్‌కు చేరతాయి. వాణిజ్య, సహకార బ్యాంకుల్లోని ఖాతాలకూ ఈ నిబంధన వర్తిస్తుంది. ఆ ఖాతాలు ఏమిటంటే..
సేవింగ్స్ బ్యాంక్ డిపాజిట్ ఖాతాలు
ఫిక్స్‌డ్ లేదా టర్మ్ డిపాజిట్ ఖాతాలు
క్యుములేటివ్/ రికరింగ్ డిపాజిట్ ఖాతాలు
కరెంట్ డిపాజిట్ ఖాతాలు
క్యాష్ క్రెడిట్ ఖాతాలు
ఏదో ఒక పేరుతో లేదా ఏదో ఒక రూపంలో ఉన్నఇతర డిపాజిట్ ఖాతాలు
కేటాయింపుల తర్వాత రుణ ఖాతాల్లోని మిగులు
లెటర్ ఆఫ్ క్రెడిట్/గ్యారెంటీతో పాటు ఇతర సెక్యూరిటీ డిపాజిట్లపై జారీ చేసే మార్జిన్ మనీ
డీఈఎ ఫండ్ నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చా?
మర్చిపోయిన లేదా క్లెయిమ్ చేయని ఎస్‌బీ/కరెంట్ ఖాతాల్లోని సొమ్మును లేదా ఫిక్స్‌డ్ లేదా టర్మ్ డిపాజిట్లను ఖాతాదారులు లేదా వారి వారసులు ఉద్గమ్ పోర్టల్‌లో లాగిన్ అయి అవసరమైన వివరాలు సమర్పించటం ద్వారా ఆయా బ్యాంకుల నుంచే క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇందుకు ఎలాంటి కాలపరిమితి లేదు. బ్యాంకులు ఈ సొమ్మును డీఈఏ నుంచి రీక్లెయిమ్ చేసుకుంటాయి.
ఉద్గమ్ పోర్టల్ పాత్ర
ఈ విషయంలో ఉద్గమ్ పోర్టల్‌ది కేవలం వెసులుబాటు పాత్ర మాత్రమే. ఖాతాదారులకు రావాల్సిన మొత్తాన్ని సంబంధిత బ్యాంక్ చెల్లిస్తుంది. ప్రస్తుతం ఉద్గమ్ పోర్టల్‌లో దేశంలోని 30 బ్యాంకులు సభ్యత్వం కలిగి ఉన్నాయి. కాకపోతే ఈ పోర్టల్ ద్వారా తమ సొమ్మును రీక్లెయిమ్ చేసుకోవాలంటే బ్యాంకు ఖాతాదారులు, డిపాజిటర్లు తమ పేరు, మొబైల్ నంబర్‌తో ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి.
ఖాతాను గుర్తించడం ఎలా..?
వ్యక్తిగత ఖాతాదారులైతే ఉద్గమ్ పోర్టల్‌లో తమ పేరు, ఖాతా లేదా డిపాజిట్ ఉన్న బ్యాంకు పేరు ఎంటర్ చేయాలి. వీటికి తోడు ఓటర్, పాన్‌కార్డు నంబర్, డ్రైవింగ్ లైసెన్సు, పాస్‌పోర్టు నంబర్ లేదా ఖాతాదారుడి పుట్టిన తేదీ సర్టిఫికెట్.. వీటిలో ఏదో ఒకటి సమర్పించాలి. అదే నాన్ ఇండివిడ్యువల్స్ అయితే సంస్థ పేరు, ఖాతా ఉన్న బ్యాంకు పేరుతో పాటు సంస్థ అధీకృత అధికారి సంతకం, పాన్ నంబరు, కంపెనీ గుర్తింపు నంబర్ (సీఐఎన్), కంపెనీని నమోదు చేసిన తేదీ.. వీటిల్లో ఎదో ఒకదాని వివరాలు ఎంటర్ చేయాలి. ఒకవేళ పై వివరాలేవీ లేకపోయినా ఉద్గమ్ పోర్టల్‌లో వ్యక్తిగత, సంస్థాగత ఖాతాదారులు తమ చిరునామా ఎంటర్ చేయడం ద్వారా తమ డిపాజిట్లను క్లెయిమ్ చేసుకోవచ్చు.
ఇతర మార్గాలూ ఉన్నాయ్..
ఒకవేళ ఉద్గమ్ పోర్టల్ ద్వారా మర్చిపోయిన ఖాతాలు లేదా డిపాజిట్లు క్లెయిమ్ చేసుకోవడం కష్టమనిపిస్తే... ఖాతా లేదా డిపాజిట్ ఉన్న బ్యాంకుకు చెందిన ఏదైనా బ్రాంచ్‌కు వెళ్లి ఆధార్, పాస్‌పోర్టు, ఓటర్ ఐడీ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు వంటి వివరాలు సమర్పించాలి. బ్యాంకు ఈ వివరాలను నిర్ధారించుకున్న తర్వాత మీ సొమ్మును వడ్డీతో సహా చెల్లిస్తుంది. ఠఛీజ్చఝ.టఛజీ.ౌటజ.జీుఽ పోర్టల్‌లో రిజిస్టరై లాగిన్ కావడం ద్వారా మీ ఖాతాలో ఎంత మొత్తం ఉన్నదీ తెలుసుకోవచ్చు.
ప్రత్యేక క్యాంపులు
ఎస్‌బీ/కరెంట్ ఖాతాల్లోని అన్‌క్లెయిమ్డ్ మొత్తాలను, ఫిక్స్‌డ్ లేదా టర్మ్ డిపాజిట్లను ఖాతాదారులకు అందించేందుకు ఆర్‌బీఐ ఈ ఏడాది అక్టోబరు నుంచి డిసెంబరు వరకు ప్రతి జిల్లాలో ప్రత్యేక క్యాంపులు నిర్వహిస్తోంది. ఈ క్యాంపుల ద్వారానూ తమ సొమ్మును రీక్లెయిమ్ చేసుకోవచ్చు.
ఇవీ చదవండి:
మస్క్‌కు లక్ష కోట్ల డాలర్ల ప్యాకేజీ
Nifty Stock Market: 25500 దిగువకు నిఫ్టీ
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి