Share News

వడ్డీరేట్ల తగ్గింపుపై వేచి చూస్తాం

ABN , Publish Date - Jun 25 , 2025 | 02:03 AM

అధ్యక్షుడు ట్రంప్‌ ఎంత అరిచి గీపెట్టినా కీలక వడ్డీరేట్లను ఇప్పటికిపుడు త గ్గించే ప్రసక్తే లేదని అమెరికన్‌ ఫెడరల్‌ రిజ ర్వ్‌ తేల్చి చెప్పింది. ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి మార్పులు...

వడ్డీరేట్ల తగ్గింపుపై వేచి చూస్తాం

ఫెడ్‌ చీఫ్‌ పోవెల్‌

వాషింగ్టన్‌: అధ్యక్షుడు ట్రంప్‌ ఎంత అరిచి గీపెట్టినా కీలక వడ్డీరేట్లను ఇప్పటికిపుడు త గ్గించే ప్రసక్తే లేదని అమెరికన్‌ ఫెడరల్‌ రిజ ర్వ్‌ తేల్చి చెప్పింది. ఆర్థిక వ్యవస్థలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయో వేచి చూసి మాత్రమే, వడ్డీరేట్ల తగ్గింపుపై నిర్ణయం తీసుకుంటామని ఫెడ్‌ చైర్మన్‌ జెరోం పోవెల్‌ స్పష్టం చేశారు. రుణ సేకరణ భారం తగ్గించేందుకు ఫెడ్‌ వెంటనే వడ్డీరేట్లు తగ్గించాలని ట్రంప్‌ పదే పదే కోరుతున్న విషయం తెలిసిందే. అయినా గత వారం జరిగిన సమావేశంలో కీలక స్వల్ప కాలిక వడ్డీరేట్లను 4.25-4.5 శాతం వద్దే కొనసాగించాలని ఫెడ్‌ నిర్ణయించింది. దీనిపె ౖట్రంప్‌ మండిపడుతూ పోవెల్‌ను మూర్ఖ శిఖామణి, అసమర్ధుడు అని నిందించారు.

ఇవీ చదవండి:

హార్ముజ్ జలసంధి మూసివేస్తే.. భారత్‌ తట్టుకోగలదా

మరోసారి మైక్రోసాఫ్ట్‌లో లేఆఫ్స్.. వేలల్లో తొలగింపులు ఉంటాయంటూ కథనాలు వైరల్

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 25 , 2025 | 02:03 AM