Fed Governor Fired: అమెరికా ఫెడ్ రిజర్వ్ గవర్నర్ లిసా కుక్‌కు ఉద్వాసన
ABN , Publish Date - Aug 27 , 2025 | 05:31 AM
తనఖా రుణాల అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై అమెరికా ఫెడరల్ రిజర్వ్ గవర్నర్ లిసా కుక్‌కు ఉద్వాసన చెప్పాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం నిర్ణయించారు. ఫెడ్‌కు గవర్నర్‌గా...
న్యూయార్క్: తనఖా రుణాల అవకతవకలకు పాల్పడ్డారన్న ఆరోపణలపై అమెరికా ఫెడరల్ రిజర్వ్ గవర్నర్ లిసా కుక్‌కు ఉద్వాసన చెప్పాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం నిర్ణయించారు. ఫెడ్‌కు గవర్నర్‌గా నియమితురాలైన తొలి ఆఫ్రికన్-ఆమెరికన్ ఆమె. ట్రంప్ నియమించిన ఫెడరల్ హౌసింగ్ ఫైనాన్స్ ఏజెన్సీ చీఫ్ విలియం పుల్టే.. లిసా తనఖా పెట్టిన రెండు నివాసాలు ఆమెకు సంబంధిచినవేనని ఆరోపించారు. దీన్ని ఆధారం చేసుకుని లిసాను రాజీనామా చేయాలని ఈ నెల 20న ట్రంప్ ఆదేశించారు. అంతేకాకుండా ‘‘మిమ్మల్ని పదవి నుంచి తొలగించేందుకు తగిన ఆధారాలున్నట్టు నేను నిర్ధారించుకున్నాను’’ అని ట్రంప్ ఆమెకు రాసిన లేఖలో పేర్కొన్నారు. తనఖా దరఖాస్తుల్లో ఆమె తప్పుడు సమాచారం ఇచ్చారని కూడా ఆరోపించారు. ఫెడ్ నాయకత్వంలో మార్పు లు చేయాలన్న తన ప్రయత్నంలో భాగంగా ట్రంప్ అనుసరిస్తున్న ఒత్తిడి వ్యూహమని విశ్లేషకులంటున్నారు. వడ్డీరేట్ల తగ్గింపు విషయంలో ఫెడ్‌కు, ట్రంప్‌కు మధ్యన విభేదాలున్న విషయం విదితమే.
ఇవీ చదవండి:
హైదరాబాద్‌లో మైక్రోసాఫ్ట్ మెగా డీల్
ఫ్లిప్‌కార్ట్‌లో 2.2 లక్షల సీజనల్ ఉద్యోగాలు
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి