‘ఎఫ్‌డీ’లపైనా తగ్గుతున్న వడ్డీ రేటు
ABN , Publish Date - Apr 11 , 2025 | 05:56 AM
ఫిక్స్‌డ్ డిపాజిట్ల (ఎఫ్‌డీ) పైనా బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గిస్తున్నాయి. వివిధ కాలపరిమితుల ఎఫ్‌డీలపై చెల్లించే వడ్డీ రేటును పావు శాత (0.25ు) తగ్గించినట్టు కోటక్ మహీంద్రా బ్యాంక్...

న్యూఢిల్లీ: ఫిక్స్‌డ్ డిపాజిట్ల (ఎఫ్‌డీ) పైనా బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గిస్తున్నాయి. వివిధ కాలపరిమితుల ఎఫ్‌డీలపై చెల్లించే వడ్డీ రేటును పావు శాత (0.25ు) తగ్గించినట్టు కోటక్ మహీంద్రా బ్యాంక్, కెనరా బ్యాంక్ ప్రకటించాయి. బుధవారం నుంచే ఈ తగ్గింపు అమల్లోకి వచ్చినట్టు తెలిపాయి. ఆర్‌బీఐ రెపో రేటును 0.25 శాతం తగ్గించటంతో ఈ బ్యాంకులు ఆ మేరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. కాగా సీనియర్ సిటిజన్ల ఎఫ్‌డీలపై మాత్రం ఎప్పటిలాగానే అర శాతం వడ్డీ అధికంగా లభిస్తుంది. మరోవైపు బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) కూడా తన ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ రుణాలపై వడ్డీ రేటును పావు శాతం తగ్గిస్తున్నట్టు ప్రకటించింది.
ఇవి కూడా చదవండి:
సీఎస్‌కేలో కీలక పరిణామం.. రుతురాజ్ స్థానంలో ధోనీ
రండి చూస్కుందాం.. గిల్ వార్నింగ్
ఒలింపిక్స్‌లో క్రికెట్.. ఆ జట్లకే చాన్స్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి