Dr Reddys Laboratories: డాక్టర్ రెడ్డీస్ ఔషధానికి ఈయూ గ్రీన్ సిగ్నల్
ABN , Publish Date - Nov 25 , 2025 | 01:43 AM
డాక్టర్ రెడ్డీస్ లేబరేటరీస్ ‘ఏవీటీ03’ అనే బయోసిమిలర్ ఔషధాన్ని మార్కెట్ చేసేందుకు యూరోపియన్ కమిషన్ ఆమోదం తెలిపింది. కేన్సర్ పేషెంట్లు, రుతు చక్రం ఆగిపోయిన స్త్రీలలో...
న్యూఢిల్లీ: డాక్టర్ రెడ్డీస్ లేబరేటరీస్ ‘ఏవీటీ03’ అనే బయోసిమిలర్ ఔషధాన్ని మార్కెట్ చేసేందుకు యూరోపియన్ కమిషన్ ఆమోదం తెలిపింది. కేన్సర్ పేషెంట్లు, రుతు చక్రం ఆగిపోయిన స్త్రీలలో ఆస్టియోపోరోసిస్ (ఎముకలు గుల్ల బారటం, బలహీనపడడం) వ్యాధిని అరికట్టేందుకు ఈ ఔషధాన్ని ఉపయోగిస్తారని కంపెనీ తెలిపింది. ఐర్లాండ్ కంపెనీ అల్వోటెక్ ఈ బయోసిమిలర్ ఔషధాన్ని అభివృద్ధి చేసి తయారు చేస్తోంది. డాక్టర్ రెడ్డీస్ ఈ ఔషధాన్ని ఈయూ, యూకే, అమెరికా తదితర దేశాల్లో మార్కెట్ చేయనుంది.
ఇవీ చదవండి:
అన్‌క్లెయిమ్డ్ బీమా మొత్తాలు క్లెయిమ్ చేసుకోవడం ఎలా
అమెజాన్‌లో భారీ లే ఆఫ్స్.. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ల పైనే ఎక్కువ ఎఫెక్ట్..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి