Egg Prices Soar: కొండెక్కిన కోడి గుడ్ల ధర
ABN , Publish Date - Nov 21 , 2025 | 05:48 AM
రెండు తెలుగు రాష్ట్రాల్లో కోడి గుడ్ల ధర కొండెక్కింది. చిత్తూరు జిల్లా హోల్‌సేల్ మార్కెట్లో 100 గుడ్ల ధర రికార్డు స్థాయిలో రూ.673కు చేరింది. విశాఖ, హైదరాబాద్ మార్కెట్లలోనూ..
100 గుడ్ల ధర రూ.673.. రిటైల్ ధర రూ.7 పైనే
విశాఖపట్నం (ఆంధ్రజ్యోతి): రెండు తెలుగు రాష్ట్రాల్లో కోడి గుడ్ల ధర కొండెక్కింది. చిత్తూరు జిల్లా హోల్‌సేల్ మార్కెట్లో 100 గుడ్ల ధర రికార్డు స్థాయిలో రూ.673కు చేరింది. విశాఖ, హైదరాబాద్ మార్కెట్లలోనూ 100 గుడ్ల ధర రూ.635కు (శుక్రవారం విక్రయించే ధర) చేరింది. విజయవాడ ప్రాంతంలోనూ హోల్‌సేల్ మార్కెట్‌లో ధర రూ.660కి చేరింది. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లోనూ రూ.639 పలుకుతోంది. దీంతో రిటైల్ మార్కెట్లో ఒక్కో గుడ్డు ధర ఏడు రూపాయలు దాటిపోయింది. ఈ ధర ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు. ఉత్తర భారతంలో చలితో గుడ్ల వినియోగం బాగా పెరిగింది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అక్కడికి ఎగుమతులు భారీగా పెరిగాయి. దీనికి తోడు ఇటీవల ఏపీ, తెలంగాణలో వ్యాధులతో పెద్ద మొత్తంలో కోళ్లు చనిపోయి గుడ్ల ఉత్పత్తి తగ్గింది. దీంతో కోడి గుడ్ల ధర కొండెక్కిందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. గుడ్ల ధర కొండెక్కినా కిలో స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.226కు తగ్గడం విశేషం.
కుప్పం ప్రజలకు అండగా ఉంటాం: నారా భువనేశ్వరి
కోర్టుకు హాజరైన కేంద్ర మంత్రి బండి సంజయ్
Read Latest AP News And Telugu News