Share News

DSR Launches Ultra Luxury Apartments: హైదరాబాద్‌లో డీఎస్‌ఆర్‌ ‘ది ట్విన్స్‌’

ABN , Publish Date - Dec 20 , 2025 | 04:10 AM

డీఎస్‌ఆర్‌ బిల్డర్స్‌ అండ్‌ డెవలపర్స్‌ హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో ‘ది ట్విన్స్‌’ పేరుతో అల్‌ట్ర లగ్జరీ రెసిడెన్షియల్‌ టవర్స్‌ను...

DSR Launches Ultra Luxury Apartments: హైదరాబాద్‌లో డీఎస్‌ఆర్‌ ‘ది ట్విన్స్‌’

  • ఒక్కో ఫ్లాట్‌ ధర రూ.22 కోట్లు

హైదరాబాద్‌: డీఎస్‌ఆర్‌ బిల్డర్స్‌ అండ్‌ డెవలపర్స్‌ హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో ‘ది ట్విన్స్‌’ పేరుతో అల్‌ట్ర లగ్జరీ రెసిడెన్షియల్‌ టవర్స్‌ను అభివృద్ధి చేస్తోంది. మూడు ఎకరాల విస్తీర్ణంలో రెండు టవర్లతో ఈ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు డీఎస్‌ఆర్‌ వ్యవస్థాపకుడు డీ అభిషేక్‌ రెడ్డి, ఎండీ రఘరామి రెడ్డి వెల్లడించారు. ఒక్కోటి 44 ఫోర్లతో కూడిన ఈ టవర్లలో మొత్తం 88 ఫ్లాట్స్‌ అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఒక్కో ఫ్లోర్‌కు 15,999 చదరపు అడుగులతో కూడిన ఒకటే ఫ్లాట్‌ ఉండటం ట్విన్‌ టవర్స్‌ ప్రత్యేకత అని వారు పేర్కొన్నారు. ఈ తరహా సింగిల్‌ ఫ్లాట్‌ను అభివృద్ధి చేయటం భారత్‌లోనే ఇది తొలిసారన్నారు. 2026 డిసెంబరు నాటికి ఈ ప్రాజెక్ట్‌ పూర్తవుతుందన్నారు. కాగా చదరపు అడుగు ధర రూ.14,000గా నిర్ణయించినట్లు వారు చెప్పారు. ఒక్కో ఫ్లాట్‌ ధర సుమారు రూ.22 కోట్ల వరకు ఉండనుంది.

ఇవీ చదవండి:

ఎంఎస్ఎంఈలకు ఏఐ దన్ను

రూపాయి పతనంపై దిగులొద్దు: సంజీవ్‌ సన్యాల్‌

Updated Date - Dec 20 , 2025 | 04:10 AM