Share News

Dr Reddys Laboratories: డాక్టర్‌ రెడ్డీస్‌ చేతికి వర్టిగో ఔషధం

ABN , Publish Date - Sep 12 , 2025 | 01:53 AM

వర్టిగో (తల తిరగటం) చికిత్సలో ఉపయోగించే స్టగెరాన్‌ బ్రాండ్‌ కొనుగోలుకు జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ (జే అండ్‌ జే)తో కీలక ఒప్పందం...

Dr Reddys Laboratories: డాక్టర్‌ రెడ్డీస్‌ చేతికి వర్టిగో ఔషధం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): వర్టిగో (తల తిరగటం) చికిత్సలో ఉపయోగించే స్టగెరాన్‌ బ్రాండ్‌ కొనుగోలుకు జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ (జే అండ్‌ జే)తో కీలక ఒప్పందం కుదుర్చుకున్నట్టు డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ ప్రకటించింది. ఈ ఒప్పందంతో భారత్‌, వియ త్నాం కీలక మార్కెట్లుగా ఈఎంఈఏ దేశాల్లో స్టగెరాన్‌ బ్రాండ్‌ హక్కులు డాక్టర్‌ రెడ్డీ్‌సకు దక్కుతాయి. స్టగెరాన్‌లో వర్టిగో, వెస్టిబ్యులార్‌ రుగ్మత చికిత్సలో ఉపయోగపడే సినారిజిన్‌ ఔషధం ఉంటుంది. యాంటీ-వర్టిగో, సెంట్రల్‌ నెర్వస్‌ సిస్టమ్‌ (సీఎన్‌ఎ్‌స) పోర్ట్‌ఫోలియో శక్తివంతం చేసుకునేందుకు ఈ బ్రాండ్‌ కొనుగోలు దోహదపడుతుందని డాక్టర్‌ రెడ్డీస్‌ తెలిపింది.

ఇవి కూడా చదవండి

జడ్పిటీసీ ఎన్నికల్లోనే దిక్కు లేదు.. 2029 గురించి కలలెందుకు?

మరోసారి రాష్ట్రంలో భారీ వర్షాలు.. హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ కేంద్రం

Updated Date - Sep 12 , 2025 | 01:54 AM