Share News

ఈ వారం దూకుడుగానే

ABN , Publish Date - Jun 30 , 2025 | 03:30 AM

దేశీయ మార్కెట్లు ఈ వారం మెరుగ్గా చలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో పరిస్థితులు సద్దుమణగడం, ముడి చమురు ధరలు తగ్గటం, భారత్‌తో వాణిజ్య ఒప్పందం చివరి దశకు చేరుకుందని...

ఈ వారం దూకుడుగానే

దేశీయ మార్కెట్లు ఈ వారం మెరుగ్గా చలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. పశ్చిమాసియాలో పరిస్థితులు సద్దుమణగడం, ముడి చమురు ధరలు తగ్గటం, భారత్‌తో వాణిజ్య ఒప్పందం చివరి దశకు చేరుకుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చెప్పటం సానుకూల అంశాలు. పైగా గత వారం నిఫ్టీ కీలకమైన 25,200 నిరోధ స్థాయిని దాటి 25,637 వద్ద స్థిరపడింది. ఎఫ్‌ఐఐలు మళ్లీ కొనుగోళ్ల బాట పట్టాయి. ప్రస్తుతం బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, మెటల్స్‌, రిఫైనరీ, ఎయిర్‌లైన్స్‌ రంగాల షేర్లు బుల్లి్‌షగా ఉన్నాయి. రియల్టీ, ఐటీ షేర్లు బేరి్‌షగా ఉన్నాయి. ఇన్వెస్టర్లు ‘పడితే కొనుగోలు చేయటమే వ్యూహా’న్ని (బై ఆన్‌ డిప్స్‌) అనుసరించటం మంచిది.

స్టాక్‌ రికమండేషన్స్‌

ఏసీసీ లిమిటెడ్‌: కొన్ని నెలలుగా ఈ షేరు డౌన్‌ట్రెండ్‌లో పయనిస్తోంది. ప్రస్తుతం కన్సాలిడేషన్‌ జరుగుతోంది. షార్ట్‌ మూమెంటమ్‌, డెలివరీ వాల్యూమ్‌ క్రమం గా పెరుగుతున్నాయి. ప్రస్తుతం ఈ షేరు కీలకమైన రూ.1,850 స్థాయిలో మరోసారి మద్దతు తీసుకుంది. గత శుక్రవారం రూ.1,920 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,900 స్థాయిలో పొజిషన్‌ తీసుకుని రూ.2,050/2,120 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.1,865 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

ఐసీఐసీఐ బ్యాంక్‌: ప్రస్తుతం ఈ షేరు జీవితకాల గరిష్ఠ స్థాయిలో కన్సాలిడేట్‌ అవుతోంది. ప్రైస్‌ యాక్షన్‌ చాలా టైట్‌గా కొనసాగుతోంది. షార్ట్‌, మీడియం టర్మ్‌ మూమెంటమ్‌, వాల్యూమ్‌ క్రమంగా పెరుగుతున్నాయి. గత శుక్రవారం రూ.1,462 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో ఇన్వెస్టర్లు రూ.1,430/1,450 శ్రేణిలో ప్రవేశించి రూ.1,600 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ1,400 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.

అదానీ ఎంటర్‌ప్రైజెస్‌: ఈ ఏడాది మార్చి నుంచి ఈ షేరు స్వల్పకాల అప్‌ట్రెండ్‌లో కొనసాగుతూ వస్తోంది. ఆరు నెలల గరిష్ఠాన్ని బ్రేక్‌ చేసింది. క్రమంగా మూమెంటమ్‌, రిలేటివ్‌ స్ట్రెంత్‌ పెరుగుతోంది. గత శుక్రవారం రూ.2,646 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.2,600 స్థాయిలో ప్రవేశించి రూ.2,850 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.2,545 స్థాయిని స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.


భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌: ఈ షేరు జీవితకాల గరిష్ఠాన్ని తాకిన తర్వాత 15 శాతం మేర దిద్దుబాటుకు లోనైంది. రక్షణ రంగంలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు దిగటమే ఇందుకు కారణం. రిలేటివ్‌ స్ట్రెంత్‌ బాగుంది. స్వల్పకాల మూమెంటమ్‌ పెరుగుతోంది. గత శుక్రవారం రూ.1,890 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.1,860 శ్రేణిలో పొజిషన్‌ తీసుకుని రూ.2,500 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.1,820 స్థాయిని కచ్చితమైన స్టాప్‌లా్‌సగా పెట్టుకోవాలి.

ఏషియన్‌ పెయింట్స్‌: కొన్ని నెలలుగా ఈ షేరు డౌన్‌ట్రెండ్‌లో పయనిస్తోంది. ఇప్పుడిప్పుడే కన్సాలిడేషన్‌ జరుగుతోంది. స్వల్పకాలిక మూమెంటమ్‌ పెరుగుతోంది. ముడి చమురు ధరలు తగ్గుతుండటంతో మళ్లీ మదుపరులు ఈ కౌంటర్‌పై ఆసక్తి చూపిస్తున్నారు. గత శుక్రవారం రూ.2,358 వద్ద ముగిసిన ఈ కౌంటర్‌లో మదుపరులు రూ.2,320/2,300 స్థాయిలో పొజిషన్‌ తీసుకుని రూ.2,500 టార్గెట్‌ ధరతో కొనుగోలు చేసే విషయాన్ని పరిశీలించవచ్చు. అయితే రూ.2,275 స్థాయిని స్టాప్‌లాస్‌గా పెట్టుకోవాలి.

మూర్తి నాయుడు పాదం,

మార్కెట్‌ నిపుణులు, నిఫ్టీ మాస్టర్‌

+91 98855 59709

నోట్‌ : పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు మదుపరులు తమ ఫైనాన్షియల్‌ అడ్వైజర్ల సలహాలు తీసుకోవాలి.

Also Read:

యువ రచయిత సూరాడ ప్రసాద్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు..

నా శత్రువు పెద్దారెడ్డి మాత్రమే...

For More Telugu News

Updated Date - Jun 30 , 2025 | 03:30 AM