Share News

ప్రత్యక్ష పన్ను వసూళ్లలో క్షీణత

ABN , Publish Date - Jun 22 , 2025 | 04:33 AM

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) తొలి త్రైమాసికంలో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.4.59 లక్షల కోట్లకు పరిమితమయ్యాయి. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే...

ప్రత్యక్ష పన్ను వసూళ్లలో క్షీణత

  • ఏప్రిల్‌ 1-జూన్‌ 19 మధ్య కాలంలో 1.39% తగ్గిన వసూళ్లు

  • రూ.4.59 లక్షల కోట్లకు పరిమితం

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) తొలి త్రైమాసికంలో నికర ప్రత్యక్ష పన్ను వసూళ్లు రూ.4.59 లక్షల కోట్లకు పరిమితమయ్యాయి. గత సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే వసూళ్లు 1.39 శాతం తగ్గాయి. అడ్వాన్స్‌ ట్యాక్స్‌ చెల్లింపుల్లో మందగమనం, రిఫండ్ల పెరుగుదల కారణంగా ఈ తగ్గుదల నమోదైందని ఆదాయ పన్ను శాఖ వెల్లడించింది. ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి జూన్‌ 19 వరకు అడ్వాన్స్‌ ట్యాక్స్‌ వసూళ్లు కేవలం 3.87 శాతం వృద్ధి చెంది రూ.1.56 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. కాగా గతేడాది ఇదే కాలంలో ఈ పన్ను వసూళ్లలో వృద్ధి రేటు ఏకంగా 27 శాతం ఉండడం గమనార్హం. అయితే ఇందులో కార్పొరేట్‌ రంగం నుంచి వచ్చిన ముందస్తు పన్ను వసూళ్లు 5.86 శాతం పెరిగి రూ.1.22 లక్ష కోట్లుగా ఉండగా.. నాన్‌-కార్పొరేట్‌ (వ్యక్తిగత, హెయూఎ్‌ఫలు, చిన్న సంస్థలు) రంగం నుంచి వచ్చిన వసూళ్లు 2.68 శాతం తగ్గి రూ.33,928 కోట్లకు పరిమితమైంది. నికర కార్పొరేట్‌ పన్ను వసూళ్లు రూ.1.73 లక్షల కోట్లుగా ఉన్నాయి. మరోవైపు వ్యక్తిగత ఆదాయ పన్ను వసూళ్లు రూ.2.73 లక్షల కోట్లుగా ఉండగా సెక్యూరిటీస్‌ ట్రాన్సాక్షన్‌ ట్యాక్స్‌ (ఎస్‌టీటీ) వసూళ్లు రూ.13,013 కోట్లుగా ఉన్నాయి. కాగా ఈ కాలంలో రిఫండ్స్‌ 58 శాతం వృద్ధితో రూ.86,385 కోట్లకు చేరుకున్నాయి.

ఇవీ చదవండి:

సేవింగ్స్ అకౌంట్‌లో మీ డబ్బు ఉందా.. అయితే మీరీ విషయాలు తప్పక తెలుసుకోవాలి

మరోసారి మైక్రోసాఫ్ట్‌లో లేఆఫ్స్.. వేలల్లో తొలగింపులు ఉంటాయంటూ కథనాలు వైరల్

మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 22 , 2025 | 04:33 AM