DGCA Tightens: పండుగ సీజన్ విమాన ధరలపై డీజీసీఏ నిఘా
ABN , Publish Date - Oct 06 , 2025 | 04:32 AM
ప్రస్తుత పండుగల సీజన్‌లో విమాన టికెట్ ధరల ధోరణి, విమానాల్లో సీట్ల సామర్థ్యంపై పౌర విమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ కార్యాలయం గట్టి నిఘా పెట్టింది. టికెట్ల ధరలు విపరీతంగా...
న్యూఢిల్లీ: ప్రస్తుత పండుగల సీజన్‌లో విమాన టికెట్ ధరల ధోరణి, విమానాల్లో సీట్ల సామర్థ్యంపై పౌర విమానయాన శాఖ డైరెక్టర్ జనరల్ కార్యాలయం గట్టి నిఘా పెట్టింది. టికెట్ల ధరలు విపరీతంగా పెంచకుండా చూడడం దీని లక్ష్యం. సాధారణంగా పండుగ సీజన్‌లో విమాన టికెట్లకు డిమాండ్ అధికంగా ఉంటుంది గనుక అధికంగా రద్దీ ఉండే రూట్లతో సహా అన్ని రూట్లలోనూ విమాన ధరలు పెంచేస్తూ ఉంటారు. విమాన ధరలపై ఎలాంటి నియంత్రణలు లేని కారణంగా ప్రజలు భరించలేని స్థాయిలో ధరలు పెంచేయకుండా కట్టడి చేయడానికి డీజీసీఏ తగు చర్యలు తీసుకుంటూ ఉంటుంది. పండుగల సీజన్‌కు ముందు విమాన ధరలపై నిఘా పెట్టిన డీజీసీఏ పెరుగుతున్న రద్దీకి దీటుగా విమాన సామర్థ్యాలు పెంచాలని విమానయాన సంస్థలను కోరినట్టు పౌర విమానయాన శాఖ తెలిపింది. సీజనల్ రద్దీని తట్టుకునేందుకు ఇండిగో, ఎయిరిండియా, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, స్పైస్‌జెట్ అదనపు సర్వీసులు నడుపుతున్నట్టు ఇప్పటికే ప్రకటించాయి.
ఇవీ చదవండి:
లాభాల నుంచి నష్టాల్లోకి.. ఈ రోజు టాప్ ఫైవ్ స్టాక్స్ ఇవే..
భారీగా పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి