Share News

Self Made Entrepreneurs India 2025ఫ స్వయంకృషి పారిశ్రామికవేత్తల్లో దీపిందర్‌ గోయల్‌ టాప్‌

ABN , Publish Date - Dec 18 , 2025 | 06:49 AM

భారత్‌లో స్వయంగా ఎదిగిన పారిశ్రామికవేత్తల (సెల్ఫ్‌ మేడ్‌ ఎంట్రప్రెన్యూర్స్‌) జాబితాలో ఎటర్నల్‌ వ్యవస్థాపకుడు దీపిందర్‌ గోయల్‌ నంబర్‌ వన్‌ స్థానం దక్కించుకున్నారు. డీమార్ట్‌ సూపర్‌ మార్కెట్ల...

Self Made Entrepreneurs India 2025ఫ స్వయంకృషి పారిశ్రామికవేత్తల్లో దీపిందర్‌ గోయల్‌ టాప్‌

  • రెండో స్థానానికి జారుకున్న దమానీ

  • మూడో స్థానంలో ఇండిగో ప్రమోటర్లు

శ్రీహర్ష మాజేటి, నందన్‌ రెడ్డికి ఐదో స్థానం

ఐడీఎ్‌ఫసీ ఫస్ట్‌ ప్రైవేట్‌-హురున్‌ ఇండియా జాబితా

న్యూఢిల్లీ: భారత్‌లో స్వయంగా ఎదిగిన పారిశ్రామికవేత్తల (సెల్ఫ్‌ మేడ్‌ ఎంట్రప్రెన్యూర్స్‌) జాబితాలో ఎటర్నల్‌ వ్యవస్థాపకుడు దీపిందర్‌ గోయల్‌ నంబర్‌ వన్‌ స్థానం దక్కించుకున్నారు. డీమార్ట్‌ సూపర్‌ మార్కెట్ల అధిపతి రాధాకిషన్‌ దమానీని వెనక్కి నెట్టి ఆయన ఆ స్థానాన్ని చేరారు. ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ జొమాటో, క్విక్‌ కామర్స్‌ వేదిక బ్లింకిట్‌ల మాతృసంస్థ అయిన ఎటర్నల్‌ విలువ రూ.3.2 లక్షల కోట్లకు చేరుకుంది. గత ఏడాదితో పోలిస్తే 27ు పెరిగింది. కాగా, గడిచిన ఏడాదికాలంలో డీమార్ట్‌ మాతృసంస్థ అవెన్యూ సూపర్‌మార్ట్స్‌ వ్యాపార విలువ 13ు తగ్గి రూ.3 లక్షల కోట్లకు పరిమితమైంది. దాంతో ఈ ఏడాది జాబితాలో దమానీ రెండో స్థానానికి జారుకున్నారు. ఇండిగో ఎయిర్‌లైన్స్‌ ప్రమోటర్లు రాహుల్‌ భాటియా, రాకేశ్‌ గంగ్వాల్‌ మూడో స్థానం దక్కించుకున్నారు. ఇండిగో మార్కెట్‌ విలువ రూ.2.2 లక్షల కోట్లుగా ఉంది. ఇండిగో ప్రమోటర్లకు టాప్‌-10 స్థానం లభించడం ఇదే తొలిసారి. ఐడీఎ్‌ఫసీ ఫస్ట్‌ ప్రైవేట్‌- హురున్‌ ఇండియా కలిసి బుధవారం విడుదల చేసిన ‘టాప్‌-200 సెల్ఫ్‌ మేడ్‌ ఎంట్రపెన్యూర్స్‌ ఆఫ్‌ ది మిలీనియా 2025’ నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది. 2000 సంవత్సరం తర్వాత ప్రారంభమైన వ్యాపారాలను ఈ జాబితాకు ఎంపిక చేసింది. కనీసం రూ.4,500 కోట్ల విలువైన కంపెనీలకు ఇందులో స్థానం కల్పించింది. ఐడీఎ్‌ఫసీ-హురున్‌ కలిసి ఈ జాబితా విడుదల చేయడం ఇది మూడోసారి.


  • మల్టీ స్పెషాలిటీ హాస్పిటళ్ల నెట్‌వర్క్‌ మ్యాక్స్‌ హెల్త్‌కేర్‌ లిమిటెడ్‌ (రూ.1,10,700 కోట్లు) చైర్మన్‌ అభయ్‌ సోయ్‌ నాలుగో స్థానంలో ఉన్నారు.

  • తెలుగు ఎంట్రప్రెన్యూర్లు శ్రీహర్ష మాజేటి, నందన్‌ రెడ్డికి ఐదో స్థానం లభించింది. వీరు స్థాపించిన ఆన్‌లైన్‌ ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ స్విగ్గీ వ్యాపార విలువ రూ.1.06 లక్షల కోట్లుగా ఉంది. గడిచిన ఏడాదికాలంలో 5ు పెరిగింది.

  • పేటీఎం (రూ.72,900 కోట్లు) వ్యవస్థాపకుడు విజయ్‌ శేఖర్‌ శర్మ ఎనిమిదో స్థానానికి ఎగబాకారు. గడిచిన ఏడాది కాలంలో పేటీఎం విలువలో 67ు వృద్ధి నమోదైంది.

  • లెన్స్‌కార్ట్‌ వ్యవస్థాపకులు పియూష్‌ బన్సల్‌, అమిత్‌ చౌదరి, నేహా బన్సల్‌, సుమీత్‌ కపాహి పదో స్థానంలో నిలిచారు. గడిచిన ఏడాది కాలంలో లెన్స్‌కార్ట్‌ వ్యాపార విలువ 60ు వృద్ధితో రూ.67,000 కోట్లకు పెరిగింది.

  • జాబితాలోని 200 కంపెనీల మొత్తం విలువ రూ.42 లక్షల కోట్లకు చేరుకుంది. గత ఏడాదిలో నమోదైన రూ.36 లక్షల కోట్లతో పోలిస్తే 15ు పెరిగింది. ఈ కంపెనీల్లో మొత్తం 8 లక్షల మంది పనిచేస్తున్నారు.

  • స్వయం శక్తి పారిశ్రామికవేత్తలు స్థాపించిన సంస్థల్లో కనీసం బిలియన్‌ డాలర్ల (100 కోట్ల డాలర్లు=రూ.9,000 కోట్లు) విలువ చేసే వాటి సంఖ్య ఈ ఏడాది 128కి చేరుకుంది. 2024లో ఈ సంఖ్య 121గా ఉంది.

  • ఈ జాబితాలోని 200 కంపెనీల్లో అత్యధికం(52) బెంగళూరుకు చెందినవే. ముంబై(41), గురుగ్రామ్‌ (36), చెన్నై (11), ఢిల్లీ (10), హైదరాబాద్‌ (8), పుణె (8) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

ఇవీ చదవండి:

జీవితకాల కనిష్ఠ స్థాయికి చేరిన రూపాయి

యశోద హాస్పిటల్స్‌, ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ పబ్లిక్‌ ఇష్యూలకు సెబీ ఓకే

Updated Date - Dec 18 , 2025 | 06:49 AM