RBI Report: తగ్గిన ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్లు
ABN , Publish Date - Oct 22 , 2025 | 01:49 AM
మన బ్యాంకులకు ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐ) పంపే డిపాజిట్లు తగ్గుముఖం పట్టాయి. గత ఏడాది ఏప్రిల్-జూలై మధ్య 580 కోట్ల డాలర్లుగా...
ముంబై: మన బ్యాంకులకు ప్రవాస భారతీయులు (ఎన్‌ఆర్‌ఐ) పంపే డిపాజిట్లు తగ్గుముఖం పట్టాయి. గత ఏడాది ఏప్రిల్-జూలై మధ్య 580 కోట్ల డాలర్లుగా ఉన్న ఈ డిపాజిట్లు.. ప్రస్తుత సంవత్సరం ఇదే కాలంలో 470 కోట్ల డాలర్లకు పడిపోయాయి. దీంతో దేశంలోని బ్యాంకుల్లో ఎన్‌ఆర్‌ఐల డిపాజిట్టు గత ఏడాది జూలై నాటికి 16,823 కోట్ల డాలర్ల నుంచి ఈ ఏడాది జూలై నాటికి 16,786 కోట్ల డాలర్లకు పడిపోయినట్టు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) తెలిపింది. ఎన్‌ఆర్‌ఐలు పంపించే ఫారిన్ కరెన్సీ నాన్ రెసిడెంట్ (బ్యాంకు) డిపాజిట్లు తగ్గిపోవడం ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి
సీఎం నియోజకవర్గం నుంచి రసవత్తర పోటీ
విధ్వంసం సృష్టించిన సౌతాఫ్రికా.. పాక్ ముందు భారీ లక్ష్యం