Dec Infrastructures: డీఈసీ ఇన్‌ఫ్రాకు రూ 2000 కోట్ల ఆర్డర్
ABN , Publish Date - Aug 15 , 2025 | 02:31 AM
హైదరాబాద్ కేంద్రంగా ఉన్న డీఈసీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ ప్రాజెక్ట్స్.. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.2,000 కోట్ల విలువైన కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్ కేంద్రంగా ఉన్న డీఈసీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ ప్రాజెక్ట్స్.. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.2,000 కోట్ల విలువైన కాంట్రాక్ట్‌ను దక్కించుకుంది. ఈ మేరకు సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ నుంచి లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్సీను అందుకున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఆర్డర్‌లో భాగంగా ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం రెసిడెన్షియల్ భవనాలను నిర్మించాల్సి ఉంటుందని తెలిపింది. శ్రీనివాసపురిలోని 20.86 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం 16 బ్లాకుల్లో 1,100 చదరపు అడుగులతో 3,112 డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్లను నిర్మించాల్సి ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం కం పెనీ చేతిలో రూ.10,000 కోట్ల విలువైన ఆర్డర్లు ఉన్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి..
పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్..
సీఎంపై ప్రశంసలు.. ఎమ్మెల్యేను బహిష్కరించిన పార్టీ
For More AndhraPradesh News And Telugu News