Q1 Earnings 2025: సైయెంట్ లాభంలో 30 శాతం వృద్ధి
ABN , Publish Date - Jul 25 , 2025 | 02:19 AM
సైయెంట్ జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో రూ.163 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): సైయెంట్ జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికంలో రూ.163 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే లాభం 30 శాతం వృద్ధి చెందింది. కాగా త్రైమాసిక సమీక్షా కాలంలో రెవెన్యూ 3.6 శాతం పెరిగి రూ.1,393 కోట్లుగా నమోదైంది. గ్రూప్‌కు చెందిన డీఈ టీ, డీఎల్‌ఎం, సెమీకండక్టర్స్ విభాగాలు అంచనాలకు తగ్గట్టుగా పనితీరును కనబరచటం కలిసివచ్చిందని సైయెంట్ ఎండీ కృష్ణ బోదనపు తెలిపారు.
ఇవీ చదవండి:
సంపన్నులు తమ ఆస్తులను ఎలా పెంచుకుంటారో తెలుసా.. సీఏ చెప్పిన ఈ సూత్రం తెలిస్తే..
వేతన జీవులకు అక్కరకొచ్చే 50-30-20 ఫార్ములా