Share News

సిగ్ని ఎనర్జీ ప్లాంట్‌ ప్రారంభం

ABN , Publish Date - May 01 , 2025 | 01:39 AM

దేశంలో అతి పెద్దదైన స్వతంత్ర ఇంధన స్టోరేజ్‌ సొల్యూషన్ల కంపెనీ సిగ్ని బుధవారం ఆటోమేటెడ్‌ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్‌ (బీఈఎ్‌సఎస్‌) గిగా...

సిగ్ని ఎనర్జీ ప్లాంట్‌ ప్రారంభం

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): దేశంలో అతి పెద్దదైన స్వతంత్ర ఇంధన స్టోరేజ్‌ సొల్యూషన్ల కంపెనీ సిగ్ని బుధవారం ఆటోమేటెడ్‌ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్‌ సిస్టమ్‌ (బీఈఎ్‌సఎస్‌) గిగా ఫ్యాక్టరీని ప్రారంభించింది. మహేశ్వరంలోని ఎలక్ర్టానిక్స్‌ తయారీ క్లస్టర్‌లో (ఈఎంసీ) ఏర్పాటైన దేశంలోనే తొలి లీడ్‌ (లీడర్‌షిప్‌ ఇన్‌ ఎనర్జీ, ఎన్విరాన్‌మెంటల్‌ డిజైన్‌) అర్హత సాధించిన ఈ ఫ్యాక్టరీని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి; ముఖ్యమంత్రి కార్యాలయంలో పరిశ్రమలు, పెట్టుబడుల విభాగం సీఈఓ జయేశ్‌ రంజన్‌ ప్రారంభించారు. రూ.100 కోట్ల పెట్టుబడితో 1.6 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో తొలి దశ నిర్మాణం జరిగింది. ఈ ఫ్యాక్టరీలో రాబోయే 24 నెలల్లో వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని ్టు సీఈఓ వెంకట్‌ రాజారామన్‌ ప్రకటించారు.

Read Also: Donald Trump:100 రోజుల్లో ట్రంప్ తుఫాన్..ఒప్పందాల నుంచి ఒడిదొడుకుల దాకా..

India Us Trade: వాణిజ్య చర్చలు బేష్... భారత్‌తో త్వరలో ఒప్పందం: ట్రంప్ కీలక వ్యాఖ్యలు

India Pakistan: టెన్షన్‌లో పాకిస్థాన్.. మరో 36 గంటల్లో..

Updated Date - May 01 , 2025 | 01:39 AM