Share News

ప్రస్తుత పొదుపు.. భవిష్యత్‌లో సరిపోదేమో..!

ABN , Publish Date - Feb 24 , 2025 | 03:35 AM

పొదుపునకు సంబంధించి భారతీయుల మనోగతంపై యూగవ్‌, ఎడెల్‌వీజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఓ సర్వే చేపట్టింది. పూర్తి స్థాయి లేదా పాక్షిక ఆర్థిక ప్రణాళికను రూపొందించుకున్నప్పటికీ, భవిష్యత్‌ అవసరాలకు...

ప్రస్తుత పొదుపు.. భవిష్యత్‌లో సరిపోదేమో..!

మెజారిటీ భారతీయుల మనోగతమిదే..

ముంబై: పొదుపునకు సంబంధించి భారతీయుల మనోగతంపై యూగవ్‌, ఎడెల్‌వీజ్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ ఓ సర్వే చేపట్టింది. పూర్తి స్థాయి లేదా పాక్షిక ఆర్థిక ప్రణాళికను రూపొందించుకున్నప్పటికీ, భవిష్యత్‌ అవసరాలకు సిద్ధంగా లేమన్న భావన కలుగుతోందని ఈ సర్వేలో పాల్గొన్న సగానికి పైగా మంది అభిప్రాయడ్డారు. తల్లిదండ్రులు, ఎదుగుతున్న పిల్లల ఆర్థిక అవసరాలు తీరుస్తున్న 35-54 ఏళ్ల వ్యక్తులపై ఈ అధ్యయనం జరిపినట్లు యూగవ్‌ వెల్లడించింది. దేశంలోని 12 నగరాలకు చెందిన 4,000 మందిని సర్వే చేసింది. అందులో 60 శాతం మంది ప్రస్తుతం ఆదా చేస్తున్న సొమ్ము భవిష్యత్‌ అవసరాలను తీర్చలేవేమోనని ఆందోళన వ్యక్తం చేశారు. మరిన్ని విషయాలు..


  • 94% మంది: ఇప్పటికే పూర్తి స్థాయి లేదా ఎంతో కొంత ఆర్థిక ప్రణాళికతో ఉన్నారు

  • 50%కి పైగా: ప్రస్తుతం ఆర్జిస్తున్న సొమ్ము సరిపోవడం లేదు. ఆర్థికంగా వెనకబడి ఉన్నాం. ప్రయత్నించినా తగినంత రాణించలేకపోతున్నాం. రుణాలపై ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. అలాగే, ఆదా చేసుకున్న సొమ్ము, సంపాదన కూడా కరిగిపోయింది

  • 64%: అప్పు చేసి స్వల్పకాలిక కోరికలను ఎలా తీర్చుకుంటున్నాం

  • 79%: ఆర్థిక పథకాల్లో పెట్టుబడులపై వచ్చే ప్రతిఫలాలతో దీర్ఘకాలిక కోరికలను నెరవేర్చుకోవాలనుకుంటున్న వారు.


Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 24 , 2025 | 03:35 AM