Share News

Crypto Market: క్రిప్టో మార్కెట్‌పై భారత మహిళల ఆసక్తి.. ఏడాదిలో 20 శాతం పెరిగిన మహిళా ఇన్వెస్టర్లు..

ABN , Publish Date - Mar 08 , 2025 | 03:40 PM

క్రిప్టో మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్న భారతీయ మహిళల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. జనవరి-2024 నుంచి జనవరి- 2025 మధ్య అంటే ఏడాది కాలంలో మధ్య క్రిప్టో పెట్టుబడులలో వారి భాగస్వామ్యం ఏకంగా 20 శాతం పెరిగింది. క్రిప్టో ఎక్స్ఛేంజ్ జియోటస్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది.

Crypto Market: క్రిప్టో మార్కెట్‌పై భారత మహిళల ఆసక్తి.. ఏడాదిలో 20 శాతం పెరిగిన మహిళా ఇన్వెస్టర్లు..
Crypto Market

క్రిప్టో మార్కెట్‌ (Crypto Market)లోకి ప్రవేశిస్తున్న భారతీయ మహిళల (Indian women) సంఖ్య క్రమంగా పెరుగుతోంది. జనవరి-2024 నుంచి జనవరి- 2025 మధ్య అంటే ఏడాది కాలంలో మధ్య క్రిప్టో పెట్టుబడులలో వారి భాగస్వామ్యం ఏకంగా 20 శాతం పెరిగింది. క్రిప్టో ఎక్స్ఛేంజ్ జియోటస్ నిర్వహించిన సర్వేలో ఈ విషయం వెల్లడైంది. మొత్తం ట్రేడింగ్ పరిమాణంలో మహిళలు ఇప్పుడు 15 శాతం వాటాను కలిగి ఉన్నారని ఈ సర్వే వెల్లడించింది. మహిళల్లో ఆర్థిక అవగాహన పెరగడం, డిజిటల్ అవగాహన పెరగడం, క్రిప్టోను ఒక నమ్మకమైన పెట్టుబడి మార్గంగా భావించడం వల్ల ఈ పెరుగుదల నమోదైనట్టు సర్వే పేర్కొంది (Women Investors).


మహిళా పెట్టుబడిదారులు దీర్ఘకాలిక పెట్టుబడులు, బిట్‌కాయిన్, ఎథెరియం వంటి స్థిరమైన ఆస్తుల వైపు మొగ్గు చూపుతున్నట్లు ఈ సర్వే పేర్కొంది. ప్రస్తుత అస్థిర మార్కెట్‌లో మహిళలు సమతుల్య పెట్టుబడి విధానాన్ని అనుసరిస్తున్నట్టు తేలింది. సాధారణంగా క్రిప్టో మార్కెట్‌ పట్ట యువత ఎక్కువగా ఆకర్షితులవుతారని అందరూ అనుకుంటారు. అయితే అందుకు విరుద్ధంగా, 36-50 సంవత్సరాల వయస్సు గల వారే క్రిప్టో మార్కెట్‌లో డామినేషన్ చూపిస్తున్నారని ఈ సర్వే వెల్లడించింది.


మరో విశేషం ఏంటంటే కేవలం మహా నగరాల నుంచే కాదు.. టైర్-2, టైర్-3 నగరాలకు చెందిన మహిళలు కూడా ట్రేడింగ్ వాల్యూమ్‌లలో ప్రధాన భాగాన్ని కలిగి ఉన్నారని సర్వే తెలిపింది. మహిళల భాగస్వామ్యం పెరగడం వల్ల మరింత స్థిరమైన, వ్యూహాత్మకమైన పెట్టుబడి మార్గంగా క్రిప్టో మార్కెట్ మారుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 08 , 2025 | 03:40 PM