Share News

కోరమాండల్‌ లాభం రూ.578 కోట్లు

ABN , Publish Date - May 01 , 2025 | 01:41 AM

కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికి రూ.578.46 కోట్ల నికర లాభం నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన...

కోరమాండల్‌ లాభం రూ.578 కోట్లు

న్యూఢిల్లీ: కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికానికి రూ.578.46 కోట్ల నికర లాభం నమోదు చేసింది. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.163.92 కోట్లతో పోలిస్తే ఇది మూడింతల కంటే ఎక్కువ. ఇదే సమయంలో కంపెనీ స్థూల ఆదాయం 28.72 శాతం పెరిగి రూ.6,114.34 కోట్లకు చేరింది. ఆర్థిక సంవత్సరం మొత్తానికి చూసినా కంపెనీ రూ.2,054.71 కోట్ల నికర లాభం ఆర్జించింది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 25.23 శాతం ఎక్కువ. అధిక అమ్మకాలు, మెరుగైన నిర్వహణా సామర్ధ్యం, వ్యూహాత్మక నిర్ణయాలతో గత ఆర్థిక సంవత్సరం మంచి పనితీరు సాధ్చమైందని కంపెనీ ఎండీ, సీఈఓ ఎస్‌ శంకర సుబ్రమణియన్‌ చెప్పారు.


కాకినాడ ప్లాంట్‌ విస్తరణ: కాకినాడలోని ప్లాంట్‌ను కోరమాండల్‌ ఇంటర్నేషనల్‌ విస్తరిస్తోంది. ఇక్కడ కొత్తగా ఫాస్పారిక్‌ యాసిడ్‌, సల్ఫ్యూరిక్‌ యాసిడ్‌ యూనిట్లు ఏర్పాటు చేస్తోంది. ఈ యూనిట్లు వచ్చే ఏడాదికల్లా ఉత్పత్తి ప్రారంభిస్తాయని సుబ్రమణియన్‌ చెప్పారు.

Read Also: Donald Trump:100 రోజుల్లో ట్రంప్ తుఫాన్..ఒప్పందాల నుంచి ఒడిదొడుకుల దాకా..

India Us Trade: వాణిజ్య చర్చలు బేష్... భారత్‌తో త్వరలో ఒప్పందం: ట్రంప్ కీలక వ్యాఖ్యలు

India Pakistan: టెన్షన్‌లో పాకిస్థాన్.. మరో 36 గంటల్లో..

Updated Date - May 01 , 2025 | 01:41 AM