Coromandel Financial Performance: 54 శాతం పెరిగిన కోరమాండల్ ఇంటర్నేషనల్ లాభం
ABN , Publish Date - Jul 25 , 2025 | 02:40 AM
కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్.. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో స్టాండ్‌ఎలోన్ ప్రాతిపదికన రూ.7,083 కోట్ల మొత్తం ఆదాయంపై...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్.. జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో స్టాండ్‌ఎలోన్ ప్రాతిపదికన రూ.7,083 కోట్ల మొత్తం ఆదాయంపై రూ.508 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే లాభం 54 శాతం వృద్ధి చెందగా ఆదాయం 49 శాతం పెరిగింది. ఈ కాలంలో న్యూట్రియంట్, అల్లైడ్ వ్యాపారాల ఆదాయం రూ.4,198 కోట్ల నుంచి రూ.6,311 కోట్లకు పెరగగా క్రాప్ ప్రొటెక్షన్ వ్యాపారం రూ.551 కోట్ల నుంచి రూ.724 కోట్లకు పెరగటం కలిసి వచ్చిందని పేర్కొంది. ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడలో 7.5 లక్షల టన్ను ల సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్న ఫెర్టిలైజర్ గ్రాన్యులేషన్ ప్లాంట్‌ను ప్రస్తుత ఆర్థిక సంవ త్సరం చివరి త్రైమాసికంలో అందుబాటులోకి తీసుకురావాలని చూస్తున్నట్లు తెలిపింది.
ఇవీ చదవండి:
సంపన్నులు తమ ఆస్తులను ఎలా పెంచుకుంటారో తెలుసా.. సీఏ చెప్పిన ఈ సూత్రం తెలిస్తే..
వేతన జీవులకు అక్కరకొచ్చే 50-30-20 ఫార్ములా