Share News

Cognizant Salary Hike: కాగ్నిజెంట్‌లో 80 శాతం సిబ్బంది జీతం పెంపు

ABN , Publish Date - Aug 15 , 2025 | 02:38 AM

ఈ ఏడాది నవంబరు 1 నుంచి 80 శాతం సిబ్బంది వేతనాన్ని పెంచనున్నట్లు నాస్‌డాక్‌ లిస్టెడ్‌ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్‌ గురువారం ప్రకటించింది. సీనియర్‌ అసోసియేట్‌ లెవెల్‌ వరకు...

Cognizant Salary Hike: కాగ్నిజెంట్‌లో 80 శాతం సిబ్బంది జీతం పెంపు

నవంబరు 1 నుంచి అమల్లోకి..

న్యూఢిల్లీ: ఈ ఏడాది నవంబరు 1 నుంచి 80 శాతం సిబ్బంది వేతనాన్ని పెంచనున్నట్లు నాస్‌డాక్‌ లిస్టెడ్‌ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్‌ గురువారం ప్రకటించింది. సీనియర్‌ అసోసియేట్‌ లెవెల్‌ వరకు ఉద్యోగులకు వేతన పెంపు ఉండనుందని తెలిపింది. జీతం పెంపు శాతం ఉద్యోగి పనితీరు, ఏ దేశంలోని కార్యాలయంలో పనిచేస్తున్నాడనే ప్రాతిపదికన నిర్ణయించనున్నట్లు కాగ్నిజెంట్‌ అధికార ప్రతినిధి వెల్లడించారు. భారత్‌లో నిలకడగా మంచి పనితీరు కనబరుస్తున్న ఉద్యోగికి 9 శాతం వరకు జీతం పెరిగే అవకాశం ఉందన్నారు. టాప్‌ పెర్‌ఫార్మర్లకు అత్యధిక వేతన పెంపు లభించనుందన్నారు. ఈ ఏడాది ద్వితీయార్థంలో తమ ఉద్యోగులకు పనితీరు ఆధారంగా వేతనాలను పెంచాలనుకుంటున్నట్లు గత నెల 31న రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాల విడుదల సందర్భంగానూ కంపెనీ వెల్లడించింది. ఈ మార్చిలో కాగ్నిజెంట్‌ తన ఉద్యోగులకు గడిచిన మూడేళ్లలో అత్యధిక బోన్‌సను ప్రకటించింది. కాగా, దేశీయ ఐటీ దిగ్గజం టీసీఎస్‌ కూడా గత వారంలో 80 శాతం సిబ్బందికి (జూనియర్‌ నుంచి మధ్య స్థాయి వరకు ఉద్యోగులకు) వేతన పెంపును ప్రకటించింది.

ఒరాకిల్‌లో 150కి పైగా ఉద్యోగాల కోత

అమెరికన్‌ ఐటీ కంపెనీ ఒరాకిల్‌ తన క్లౌడ్‌ విభాగం నుంచి 150కి పైగా ఉద్యోగులను తొలగించబోతున్నట్లు తెలిసింది. కంపెనీ తాజా నిర్ణయంతో యూఎ్‌సతో పాటు భారత కార్యాలయాల్లోని ఈ విభాగ ఉద్యోగులపై ప్రభావం పడనుందని సమాచారం.

ఈ వార్తలు కూడా చదవండి..

పలు జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్స్..

సీఎంపై ప్రశంసలు.. ఎమ్మెల్యేను బహిష్కరించిన పార్టీ

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Aug 15 , 2025 | 02:38 AM