హైదరాబాద్‌లో మిల్టెనీ బయోటెక్ సీఓఈ
ABN , Publish Date - Feb 25 , 2025 | 02:07 AM
హైదరాబాద్‌లో తొలి సెల్, జీన్ థెరపీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) ప్రారంభించినట్టు మిల్టెనీ బయోటెక్ ప్రకటించింది. జినోమ్ వ్యాలీలో 1,800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): హైదరాబాద్‌లో తొలి సెల్, జీన్ థెరపీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీఓఈ) ప్రారంభించినట్టు మిల్టెనీ బయోటెక్ ప్రకటించింది. జినోమ్ వ్యాలీలో 1,800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో మిల్టెనీ ఇన్నోవేషన్ అండ్ టెక్నాలజీ సెంటర్‌ను (ఎంఐటీసీ) ఏర్పాటు చేసినట్టు తెలిపింది. ఇందులో సెల్, జీన్ థెరపీలపై అధ్యయనం చేస్తారు. క్యాన్సర్ సహా విభిన్న వ్యాధులపై పోరాటంలో అత్యుత్తమ ప్రమాణాలు, అత్యాధునిక టెక్నాలజీలు, నైపుణ్యాలను సమీకృతం చేయడం ద్వారా ఇన్నోవేషన్‌ను ప్రోత్సహించనున్నట్టు కంపెనీ తెలిపింది. ఇమ్యునాలజీ, స్టెమ్ సెల్ బయాలజీ, క్యాన్సర్ పరిశోధన వంటి కీలక రంగాలపై వర్క్‌షా్‌పలు, సెమినార్లు నిర్వహించే ఒక సహకార హబ్‌గా ఇది పని చేస్తుందని పేర్కొంది. ఈ సహకారం రాష్ట్ర ఆరోగ్య సంరక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయడంతో పాటు సెల్, జీన్ థెరపీలో విప్లవాత్మక పరిశోధనలకు దారి తీయగలదన్న ఆశాభావం తెలంగాణ ఐటీ శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి జయేష్ రంజన్ ప్రకటించారు.
ఇవి కూడా చదవండి:
Apple iPhone: మార్కెట్లోకి కొత్త ఐఫోన్ మోడల్.. ఈనెల 28 నుంచి సేల్, 10 వేలు తగ్గింపు ఆఫర్
OpenAI: ఓపెన్ ఏఐ నుంచి కొత్తగా ఏఐ ఏజెంట్.. దీని స్పెషల్ ఏంటంటే..
Bank Holidays: మార్చి 2025లో బ్యాంకు సెలవులు.. ఈసారి ఎన్ని రోజులంటే..
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
Read More Business News and Latest Telugu News