CII Proposes India: భారత అభివృద్ధి వ్యూహాత్మక నిధి ఏర్పాటు చేయండి
ABN , Publish Date - Nov 10 , 2025 | 05:29 AM
భారత్ దీర్ఘకాలిక వృద్ధికి, ఆటుపోట్లు తట్టుకుని నిలబడేందుకు, కీలక ఆర్థిక ప్రయోజనాల సాధనకు అవసరమైన నిధుల కల్పన కోసం భారత అభివృద్ధి, వ్యూహాత్మక నిధిని (ఐడీఎ్‌సఎఫ్) ఏర్పాటు...
ప్రభుత్వానికి సీఐఐ సూచన
న్యూఢిల్లీ: భారత్ దీర్ఘకాలిక వృద్ధికి, ఆటుపోట్లు తట్టుకుని నిలబడేందుకు, కీలక ఆర్థిక ప్రయోజనాల సాధనకు అవసరమైన నిధుల కల్పన కోసం భారత అభివృద్ధి, వ్యూహాత్మక నిధిని (ఐడీఎ్‌సఎఫ్) ఏర్పాటు చేయాలని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ప్రభుత్వానికి సూచించింది. వృద్ధికి కొత్త శక్తి ఇవ్వడంతో పాటు దేశ భవిష్యత్తుకు భరోసా ఇచ్చేందుకు ఈ నిధి అవసరమని తేల్చి చెప్పింది. క్రమశిక్షణతో రూపకల్పన చేసినట్టయితే రాబోయే రెండు దశాబ్దాల కాలంలో ఈ నిధిలోని మూలధనం 1.3 లక్షల కోట్ల నుంచి 2.6 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరుకుంటుందని అంచనా. ప్రాథమికంగా కొంత సొమ్ము బడ్జెట్ నుంచి కేటాయిస్తే ఆస్తుల నగదీకరణ ద్వారా సమకూరే సొమ్ముతో నిధిలో మూలధనం పెరుగుతూ వస్తుందని సీఐఐ భావన. ప్రస్తుతం జాతీయ పెట్టుబడులు, మౌలిక వసతుల నిధి (ఎన్‌ఐఐఎ్‌ఫ) అభివృద్ధి నిధిగా వ్యవహరిస్తుందని, తాజాగా ప్రతిపాదిస్తున్న ఈ వ్యూహాత్మక నిధి భారత దీర్ఘకాలిక వృద్ధి, భద్రతా ప్రయోజనాలకు అవసరమైన విదేశీ ఆస్తులను కొనుగోలు చేసి భద్రపరుస్తుందని పేర్కొంది.
ఇవి కూడా చదవండి:
పాక్ ఆర్మీ చీఫ్‌కు లబ్ధి చేకూర్చే రాజ్యాంగ సవరణ.. భగ్గుమన్న ప్రతిపక్షాలు
ఒహాయో గవర్నర్ ఎన్నికలు.. వివేక్ అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపిన ట్రంప్
మరిన్ని బిజినెస్, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి