Three Tier GST: మూడంచెల జీ ఎస్ టీ రేట్లు వాంఛనీయం
ABN , Publish Date - Jul 04 , 2025 | 05:26 AM
దేశంలో సరళమైన మూడంచెల జీఎస్టీ విధానం అమలు చేయాలని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) నూతన అధ్యక్షుడు రాజీవ్ మెమానీ సూచించారు. నిత్యావసర వస్తువులకు 5%, విలాసవంతమైన...
ఈ ఏడాది వృద్ధి 6.4-6.7%
సీఐఐ కొత్త అధ్యక్షుడు రాజీవ్ మెమానీ
న్యూఢిల్లీ: దేశంలో సరళమైన మూడంచెల జీఎస్టీ విధానం అమలు చేయాలని భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) నూతన అధ్యక్షుడు రాజీవ్ మెమానీ సూచించారు. నిత్యావసర వస్తువులకు 5%, విలాసవంతమైన వస్తువులకు 28% కనిష్ఠ, గరిష్ఠ రేటు, మిగతా వస్తువులన్నింటికీ మధ్యేమార్గంగా 12-18% రేటు ఉండాలన్న అభిప్రాయం ఆయన ప్రకటించారు. ప్రస్తుతం దేశంలో నాలుగంచెల జీఎ్‌సటీ విధానం (5, 12, 18, 28 శాతం) అమలులో ఉంది. సీఐఐ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టిన అనంతరం తొలి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. వస్తు సేవల పన్నును (జీ ఎస్ టీ) హేతుబద్ధం చేయాల్సిన అవసం ఉన్నదని నొక్కి చెప్పారు. ప్రధానంగా అల్పాదాయ వర్గాల ప్రజలు అధికంగా ఉపయోగించే వస్తువులపై పన్ను రేటు తగ్గించాలని ఆయన సూచించారు. అలాగే సిమెంట్ సహా అధిక శాతం ఉత్పత్తులపై ప్రస్తుతం 28% జీఎ్‌సటీ అమలులో ఉన్నదని, ఆ రేటును కూడా హేతుబద్ధీకరించడం వల్ల ఆర్థిక కార్యకలాపాలు జోరందుకుంటాయని అన్నారు. పెట్రోలియం, విద్యుత్, రియల్ ఎస్టేట్, ఆల్కహాల్ ఉత్పత్తులను కూడా జీ ఎస్ టీ పరిధిలోకి తెచ్చే విషయంలో జాతీయ స్థాయి ఏకాభిప్రాయ సాధన అవసరమని రాజీవ్ సూచించారు. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.4 శాతం నుంచి 6.7 శాతం మధ్యలో ఉండవచ్చని భారత రాజీవ్ అంచనా వేశారు.
మన దేశ వృద్ధి రేటుకు రిస్క్‌లు, బలాలు కూడా సమతూకంగా ఉన్నాయన్నారు. భౌగోళిక, రాజకీయ అస్థిరతలు వృద్ధిని క్షీణింప చేసే ప్రమాదం ఉన్నప్పటికీ వస్తు, సేవలకు దేశీయ డిమాండు బలంగా ఉండడం వృద్ధిని ఉద్దీపింప చేసే అంశమని ఆయన వివరించారు.
ఇవి కూడా చదవండి
చమురు తీసుకుంటే భారత్‌పై 500% సుంకం.. జైశంకర్ రియాక్షన్
రూ.15 వేల పెట్టుబడితో రూ.12 కోట్ల రాబడి.. ఎలాగో తెలుసా..
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి